Revanth Reddy to jail

Revanth Reddy: ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న రేవంత్ రెడ్డికి త్వరలోనే ఓ గండం ఉండబోతున్నట్టు తెలుస్తోంది.అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి,చంద్రబాబులు పేర్లు వినిపించిన సంగతి మనకు తెలిసిందే.అంతే కాదు ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో ఈ కేసులో ఇప్పటివరకు ఎందుకు వీరిని అరెస్టు చేయడం లేదు అని పలుమార్లు దీన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు.ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరొకసారి ఈ విషయాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

Revanth Reddy to jail

సుప్రీంకోర్టులో ఈ కేసుని మళ్ళీ రీ ఓపెన్ చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ కేసు పై 2017 లోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాను. కానీ ఐదు నెలలు చిన్న చిన్న కారణాలవల్ల కేసు వాయిదా వేశారు.కానీ ఇప్పటికి కూడా నిందితులను న్యాయస్థానం శిక్షించడం లేదు. రేపు ఈ కేసులో విచారణ జరగబోతుంది. చంద్రబాబుని ముద్దాయిగా చేర్చాలని నేను పిటిషన్ వేశాను అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. అలాగే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా కూడా ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో అనుమానం కలుగుతుంది అని ఆయన అన్నారు. (Revanth Reddy)

Also Read: ABP-CVoter Opinion Poll: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలలో ఆ పార్టీలు మునగడం పక్కా… సర్వే రిపోర్ట్ ఇదే

ఈ ఒక్క కేసు మాత్రమే కాదు ఇంకా మూడు కేసులు ఉన్నాయి. వీటన్నింటినీ తెలంగాణ ఏసీబీ సక్రమంగా పూర్తి చేసి సిబిఐతో విచారణ చేయించాలని నేను కోరుతున్నాను. ఆడియో, వీడియో తో సహా అడ్డంగా దొరికాక సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిన కూడా చంద్రబాబు వాటన్నింటిని బుకాయిస్తున్నారు.ఈ కేసులో చంద్రబాబు నిందితుడిగా చేర్చాలి అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియా ముందు మాట్లాడారు. 2015 లో రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్ సన్ ఓటు కోసం 50 లక్షలు ఇస్తూ అడ్డంగా పట్టుబడ్డారు. అయితే ఇందులో మెయిన్ చంద్రబాబు..

Revanth Reddy to jail

దీంతో ఈ కేసు అప్పటినుండి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.అయితే ఇన్ని సంవత్సరాలైనా ఈ కేసులో మళ్ళీ ఎలాంటి స్పందన లేకపోవడంతో వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారం రోజు ఈ కేసు గురించి మళ్ళీ తెరపైకి తీసుకువచ్చారు. ఈ కేసు న్యాయ వ్యవస్థ పై నమ్మకం కలిగేలా ఉండాలని ఆయన తెలిపారు అయితే ప్రస్తుతం ఈ వార్త మీడియాలో వైరల్ అవ్వడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా రుజువైతే మాత్రం చంద్రబాబుతో పాటు జైలుకు వెళ్లాల్సిందే అని మాట్లాడుకుంటున్నారు.(Revanth Reddy)

Join WhatsApp