Revanth Reddy Wearing 50 Thousand Rupees Slippers

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్ గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించింది. కానీ తెలంగాణ ఆదాయం కంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయని అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతానికి ఆరోగ్యానికి ఒకేసారి అమలు చేయబోమని… వందరోజుల సమయం తమకు ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ కోరింది.

Revanth Reddy Wearing 50 Thousand Rupees Slippers

ఇక దీనికి విపక్షాలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా తల ఊపారు. అయితే ప్రస్తుతానికి రెండు గ్యారెంటీలు అయిన ఆరోగ్యశ్రీ అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉచిత బస్సు కు మహాలక్ష్మి అనే పేరు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ ఉచిత బస్సు కారణంగా ఆటో డ్రైవర్లు రోడ్డున పడిన సంగతి తెలిసిందే. ఉచిత బస్సు పేరుతో తమ జీవితాలను ఆడుకుంటుందని కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు ఆటో డ్రైవర్లు.

Also Read: Revanth Reddy: రేవంత్ ఆటలో కోదండరాం బలి అయ్యాడా.. ముందే తెలిసి ఇలా చేశాడా ?

అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో ఆదాయం తక్కువగా ఉన్నదని పేర్కొన్న రేవంత్ రెడ్డి పై భారత రాష్ట్ర సమితి పార్టీ నేతలు అలాగే తెలంగాణ ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆదాయం లేదన్న తెలంగాణలో నువ్వు ఖరీదైన చెప్పులు ఎందుకు వాడుతున్నామని ఫైర్ అవుతున్నారు. మొన్నటి నుంచి రేవంత్ రెడ్డి వేసుకున్న చెప్పులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రేవంత్ రెడ్డి వేసుకున్న చెప్పులు గుచ్చి బ్రాండ్ కు చెందినవి.

ఈ చెప్పుల ధర 50 వేల రూపాయలు. రైతు బిడ్డ అంటూ… 50వేల రూపాయల విలువ చేసిన చెప్పులు ఎందుకు వేసుకున్నామని ఫైర్ అవుతున్నారు. అలాగే.. రేవంత్ రెడ్డి వేసుకునే షూస్ కూడా చాలా ఖరీదైనవి. అదే గతంలో మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్… 400 రూపాయల సాధారణ చెప్పులు వాడేవారు.

దీంతో కేసీఆర్ ని మెచ్చుకుంటూ రేవంత్ రెడ్డి తిడుతున్నారు తెలంగాణ ప్రజలు. తెలంగాణ రాష్ట్ర అప్పుల పాల అయిందని ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు ఖరీదైన చెప్పులు ఎందుకు వాడుతున్నాడని ఎప్పుడు జరుగుతున్నారు. రైతుబంధు సరిగ్గా వేయడం చేతకాదు కాని… చెప్పుడు మాత్రం ఖరీదైనవి వేసుకుంటాడని ఫైర్ అవుతున్నారు.

Join WhatsApp