Revanth Reddy's re-entry into AP politics

Revanth Reddy: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక అందరి చూపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పైనే పడింది. అయితే మరికొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ వై నాట్ 175 అనే ఫార్ములాతో ముందుకు వెళ్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం చంద్రబాబు నాయుడు జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇలాంటి వేళ రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు అంటూ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Revanth Reddy’s re-entry into AP politics

దానికి ప్రధాన కారణం రీసెంట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేను తెలంగాణ సీఎం అయితే కనీసం జగన్ నాకు ఫోన్ చేసి కూడా అభినందనలు చెప్పలేదు అని చెప్పారు. అయితే దీన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా కేసీఆర్ వైపే ఉన్నారని, రేవంత్ రెడ్డిని చంద్రబాబు పల్లకి మోసే వాడనే అనుకుంటున్నారని తెలుస్తోంది.. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పరోక్షంగా చంద్రబాబు నాయుడికి సహాయం చేయబోతున్నారని సమాచారం. ఇక కేసిఆర్ కి సన్నిహితుడైన జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడగొట్టాలని రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారట.(Revanth Reddy)

Also Read: Nara Bhuvaneshwari: కేశినేనికి షాక్..ఎంపీ బరిలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ?

అంతే కాదు నీళ్ల విషయంలో కేసీఆర్ జగన్మోహన్ తో కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని ఆయన అప్పట్లో కొన్ని సంచలన కామెంట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణకు రావాల్సిన నీళ్లను రానివ్వకుండా ఆంధ్రాకి మళ్ళించారని అన్నారు. అలాగే గత ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి సహాయం చేశారని,ఆ సమయంలో తనని ఘోరంగా ఓడగొట్టారని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.

Revanth Reddy's re-entry into AP politics

అందుకే ఇప్పుడు ఆయన అధికారంలోకి రావడంతో ఆంధ్రాలో ఎలాగైనా చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే ఆంధ్ర రాజకీయాల్లోకి రేవంత్ రెడ్డి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది చూసిన కొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మరి తెలంగాణ పరిస్థితి ఏమైపోతుంది.. తెలంగాణ సీఎం పోయి ఆంధ్రాలో రాజకీయం చేస్తే తెలంగాణ ప్రజలు ఏమైపోవాలి అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.అంతేకాదు రేవంత్ రెడ్డి ఎప్పటికైనా చంద్రబాబు చేతిలో కీలుబొమ్మనే అని మేము ముందే చెప్పాం గా అంటూ కామెంట్లు చేస్తున్నారు.(Revanth Reddy)

Join WhatsApp