rs praveen kumar joins in kcr party

Kcr: తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత గులాబీ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గులాబీ పార్టీ అధికారం కోల్పోవడంతో కీలక నేతలందరూ జారుకుంటున్నారు. అధికారం లేదన్న భావనతో గులాబీ పార్టీని ఒంటరి చేస్తున్నారు. అవకాశాల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ లేదా బిజెపిలోకి వెళ్తున్నారు. హలో ఇప్పటికే సైదిరెడ్డి, బొంతు రామ్మోహన్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ లాంటి కీలక నేతలు అందరూ ఇతర పార్టీలోకి వెళ్లారు. Kcr

rs praveen kumar joins in kcr party

పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో గులాబీ పార్టీని విడిచి ఇతర పార్టీలోకి వెళ్లి టికెట్లు తీసుకుంటున్నారు. కొంతమంది కాంట్రాక్టులు పట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి కష్టకాలంలో గులాబీ పార్టీకి అండగా నిలిచేందుకు బహుజన సమాజ్వాది పార్టీ మాజీ నాయకులు, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీని కష్టకాలంలో కాపాడేందుకు తాను వస్తున్నానని స్పష్టం చేశారు.

Also Read: Ys Sharmila: కడప నుంచి ఎంపీగా బరిలో వైఎస్ షర్మిల?

అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ పార్టీలో చేరితే కచ్చితంగా కేసీఆర్ కు లాభం చేకూరుతుంది. బహుజన దళిత, మాల మరియు మాదిగ సామాజిక వర్గా ఓట్లు గులాబీ పార్టీకి టర్న్ అవుతాయి. ఇదే స్ట్రాటజీని కెసిఆర్ అప్లై చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తమ పార్టీలో చేర్చుకున్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా గులాబీ పార్టీ గెలవాల్సిందే. లేకపోతే గులాబీ పార్టీ మనుగడ ఉండదు.

కాబట్టి గతంలో తనను తిట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కూడా పార్టీలో చేర్చుకున్నారు గులాబీ బాస్ కల్వకుంట చంద్రశేఖర రావు. అంతేకాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కేటీఆర్ పదవిని కట్టబట్టేందుకు నిర్ణయం తీసుకున్నారట కెసిఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ను తప్పించి.. దళిత నాయకుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కు ఆ పదవి ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇలా చేస్తే కచ్చితంగా గులాబీ పార్టీకి మంచి పేరు వస్తుంది. అలాగే ఓటింగ్ పర్సెంట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న కెసిఆర్… రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారట.

Join WhatsApp