Survey On AP Elections

AP Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. దీంతో వైసిపి తో పాటు తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు గ్రౌండ్ స్థాయిలో ప్రచారాన్ని ఇప్పుడే మొదలుపెట్టాయి. అటు సిద్ధం పేరుతో వైసిపి పార్టీ దూసుకుపోతోంది. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి… ఏపీలో ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Survey On AP Elections

ఇలాంటి నేపథ్యంలో ఏపీ ఎన్నికలపై ఓ సంచలన సర్వే బయటకు వచ్చింది. మూడ్ ఆఫ్ ఏపీ సర్వేను… పాపులర్ ఫ్రీ పోల్ సర్వే పేరుతో సంస్థ తీసుకువచ్చింది. అయితే ఈ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని లోక్సభ సీట్లు వస్తాయో ? ఎంత శాతం లోక్సభ ఎన్నికలలో ఓట్లు పోల్ అవుతాయని దానిపై మాత్రమే రిపోర్టు విడుదల చేసింది.

ఇక ఈ సర్వే ప్రకారం… వైసిపి పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటుందని తేలిపోయింది. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో… వైసిపి పార్టీకి 10 నుంచి 11 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చి చెప్పింది ఈ సర్వే సంస్థ. విజయవాడ, తిరుపతి, చిత్తూరు, రాజంపేట, అరకు నంద్యాల, కడప, ఏలూరు, అమలాపురం, అరకు, విజయనగరం, ఎంపీ సీట్లను వైసిపి గెలుచుకుంటుందని ఈ సర్వే తేల్చి చెప్పింది.

Also Read: YS Sharmila: షర్మిల దూకుడు..ఆ పార్టీకి చెందిన ఓట్లకు గండీ పడనుందా ?

ఈ కాటు జనసేన మరియు తెలుగుదేశం పార్టీకూటమికి కేవలం 9 సీట్లు వస్తాయని… ఈ తొమ్మిది సీట్లలో వైసీపీతో హోరా హోరి పోటీ ఉంటుందని స్పష్టం చేసింది. శ్రీకాకుళం, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, అనంతపూర్, రాజమండ్రి, హిందూపూర్, కర్నూలు, కాకినాడ, నర్సాపూర్, బాపట్ల, నరసరావుపేట, అనకాపల్లి, విశాఖపట్నం ఎంపీ సీట్లలో జనసేన మరియు తెలుగుదేశం గట్టి పోటీ ఇచ్చి 9 సీట్లు సాధిస్తుందని ఈ సర్వే స్పష్టం చేసింది.

అయితే ఈ ఎంపీ సీట్ల లెక్క ప్రకారం అసెంబ్లీ సీట్లను ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందో అని అంచనా కూడా వేయవచ్చు. ఒక్క ఎంపీ సీటుకు 7 ఎమ్మెల్యేలు వేసుకుంటే… అధికార వైసీపీ పార్టీకి 70 సీట్లకు పైగా వచ్చే ఛాన్స్ ఉంది. అటు తెలుగుదేశం మరియు జనసేన కూటమికి 63 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 8 సీట్లు గెలవాల్సి ఉంటుంది. అంటే ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వైసిపి పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నమాట. ఈ సర్వే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. (AP Elections)

Join WhatsApp