chadnrababu 1TDP Sri Bharath

TDP వికృత క్రీడ: ఓడిపోతుందని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ, విశాఖపట్నం పార్లమెంటు బరిలో అడ్డగోలు రాజకీయాలకు తెరలేపింది. ఇన్నాళ్లూ బయటి ప్రపంచానికి చూపించిన ముఖం వెనుక దాగిన తన సహజ వికృత రూపాన్ని బయటకు తీస్తోంది. మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చూపిన మార్గంలోనే నాయకులు నడిచేందుకు సన్నద్ధమవుతున్నారు.

TDP Vishakha Parliament Candidate Sri Bharath Vote Scam

ముఖ్యంగా విశాఖ పార్లమెంటు పరిధిలోని తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ నయవంచక రాజకీయాలకు తెరతీశారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విశాఖ రాజధాని పరిపాలన తథ్యం అని తేలడంతో మొత్తం ఉత్తరాంధ్ర అంతా కూడా వైసీపీ క్లీన్ స్వీప్ అని స్పష్టమైపోయింది.ఎన్ని సర్వేలు చేసినా, ఎంత తిప్పి తిప్పి చేసినా ఇదే రిజల్ట్ వస్తోంది. ఉత్తరాంధ్రలోని మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వార్ వన్ సైడ్ అంటున్నారు.

ఈ క్రమంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ కూడా ఓడిపోవడం ఖాయమని తేలిపోయింది. దీంతో ఇన్నాళ్లూ సంపాదించిన అవినీతి సొమ్ములను కుమ్మరిస్తున్నారని, మూటల్లో కట్టుకుని పట్టుకు తిరుగుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా చంద్రబాబునాయుడి ప్రాణమంతా అమరావతిలో ముడిపడి ఉంది. అది ఆగకూడదు. అలాగంటే విశాఖపట్నంలో తెలుగుదేశం దీపం ఆరిపోయేలా ఉంది. అందుకని డబుల్ గేమ్, త్రిబుల్ గేమ్ ఆడుతూ ఏ ప్రాంతానికి వెళితే, అక్కడ పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారు.

ప్రస్తుతం అమరావతి ప్రాంతంలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 సీట్లలోనే తెలుగుదేశం గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల చాలా టెన్షను పడుతున్నారు. ముఖ్యంగా విశాఖ పార్లమెంటు పరిధిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీ గెలుపు తథ్యం అనే సమాచారం ప్రత్యర్థి పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది.

చంద్రబాబు దయతో, సామాజికవర్గం కృపతో వేలకోట్లకు అధిపతి అయినా గోల్డ్ స్పాట్ మూర్తి మనవడు శ్రీ భరత్ ఇక వెనుకనుండి కథనంతా నడుపుతున్నారనే విమర్శలు నెట్టింట తీవ్రంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్సా ఝాన్సీలాంటి కీలకమైన నేతను ఓడగొట్టాలనే పంతంతో మరీ పనిచేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

తెలుగుదేశం వాళ్లు ఓటుకి ఎంతిచ్చినా సరే, ఎన్ని కుయక్తులు పన్నినా సరే, జగనన్న సంక్షేమ పథకాలు, జగనన్న విద్యా పథకాలు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ,, వైఎస్సార్ నవరత్నాలే తనను గెలిపిస్తాయని బొత్సా ఝాన్సీ బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. అంతేకాదు గతంలో ఎంపీగా ఉండి తాను చేసిన అభివ్రద్ధి, ఉత్తారంధ్ర కోసం పోరాడిన తీరు ఇవన్నీ కూడా తమకు సానుకూలాంశాలని చెబుతున్నారు.

అన్నింటికన్నా మించి ఉత్తరాంధ్ర ప్రజలు తనని ఆడబిడ్డలా చూస్తున్నారని, సొంత బిడ్డలా ఆదరిస్తున్నారని, ఇక తన గెలుపుని ఆపడం ఎవరి తరం కాదని ఛాలెంజ్ చేస్తున్నారు.

ఇవన్నీ చూసిన వారందరూ… ఉత్తరాంధ్రలో తెలుగుదేశం నేతలందరూ తట్టా బుట్టా సర్దుకుని, చంద్రబాబుతో సహా సన్యాసాశ్రమానికి బయలుదేరే సమయం ఆసన్నమైందని అంటున్నారు.

Join WhatsApp