Ten thousand per vote in Pithapuram...one lakh per family

Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఇటీవలే… పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల తో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు అధికారులు. దీంతో ఏపీలో రెండు ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెంటర్ గా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. Pawan kalyan

Ten thousand per vote in Pithapuram one lakh per family

ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఎన్నడూ లేని విధంగా భీమవరం, గాజువాక నియోజకవర్గాలను వదిలేశాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓట్లు ఎక్కువ ఉన్నా నేపథ్యంలో అక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు.Pawan kalyan

Also Read: Kcr: కేసీఆర్ బిగ్ స్కెచ్…RS ప్రవీణ్ కు కేటీఆర్ పోస్ట్ ?

నియోజకవర్గంలో 90000 వరకు కాపు ఓట్లు ఉన్నాయి. కాపు ఓట్లు అన్ని జనసేనకు పడతాయని నమ్మకంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకు వైసిపి పార్టీ కూడా అదే తరహాలో వ్యవహరిస్తుంది. పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడించేందుకు కాపు నేత అయిన వంగ గీతాకు టికెట్ ఇచ్చారు. అలాగే పిఠాపురం ఎన్నికల బాధ్యతలను కాపు ఉద్యమ నేత అయిన ముద్రగడకు అప్పగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. Pawan kalyan

దీంతో ఏపీ రాజకీయాలు అన్ని పిఠాపురం కేంద్రంగా నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసిపి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అటు గెలిచేందుకు పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఖర్చు పెట్టేందుకు రెడీ అవుతున్నారట. ఈ లెక్కన ఒక్కో ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయట. ఆ లెక్కన ఐదు ఓట్లు ఉంటే ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల వరకు వస్తాయి. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి ఏ పార్టీ ఎన్ని డబ్బులు పంచుతుందో చూడాలి.Pawan kalyan

Join WhatsApp