That Party Says Goodbye to Pawan Kalyan's Janasena

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయం అసలు ఎటు నుండి ఎటు తిరుగుతుందో కూడా జనసేన కార్యకర్తలకే అర్థం అవ్వకుండా ఉంది.ఎందుకంటే ఆంధ్రాలో ఆయన చంద్రబాబు పల్లకి మోస్తున్నారని ఇప్పటికే ఎంతోమంది సొంత పార్టీ కార్యకర్తలే ఆయనను విమర్శించారు. ఇక అది చాలదన్నట్లు టిడిపి ఇచ్చిన సీట్లు తీసుకుంటూ వారికి వత్తాసు పలుకుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆశయం ఒక్కటే ఉంది. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడమే.దానికోసం ఎక్కడి దాకా నైనా వెళ్తారు. ఎవరి పల్లకినైనా మోస్తారు అనే తీరులో ఆయన ప్రవర్తిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని యూజ్ లెస్ అని ఆ పార్టీ భావిస్తుందట.. అందుకే జనసేనతో తమ దోస్తానా ని కటిఫ్ చేసుకోవాలని చూస్తోంది.

That Party Says Goodbye to Pawan Kalyan’s Janasena

ఇక పవన్ కళ్యాణ్ ని పక్కన పెట్టాలనుకున్న ఆ పార్టీ ఏదో కాదు బిజెపి.ఆంధ్రాలో బిజెపి ఒంటరిగానే పోటీ చేయాలని చూస్తోంది. అయితే టిడిపి జనసేన మాత్రం బిజెపిని కూడా తమతో కలుపుకోవాలి అని చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ తో టిడిపికి జనసేనకి సీక్రెట్ బంధం ఉందని, ఈ కారణంతోనే బిజెపి టిడిపి పార్టీకి దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకే దగ్గర రెండు నేషనల్ పార్టీస్ ఉండలేవు. అయితే బిజెపి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజులు ఉన్నాయి అనగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మరీ ఆయనతో పొత్తు పెట్టుకున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ బిజెపితో పొత్తు పెట్టుకుని తెలంగాణలో 30 సీట్లు ఇవ్వమని అడిగారు. (Pawan Kalyan)

Also Read: YS Sharmila: షర్మిలను వదిలేసి జగన్ కు అండగా విజయమ్మ.. త్వరలోనే ప్రచారం..!!

కానీ 30 సీట్లు అడిగితే 8 ఇచ్చి పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించినప్పటికీ ఆయన మాత్రం దొరికిందే మోక్షం అన్నట్లుగా 8 స్థానాల్లో పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో బిజెపి తెలంగాణలో దోస్తాన చేయడం వల్ల నష్టమే కలిగింది కానీ లాభం అయితే చేకూర లేదు. అయితే ఈసారి బిజెపి సరికొత్త ప్లాన్ వేసిందట. అదేంటంటే పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే ఆయన మీద ఉన్న అభిమానంతో తమకి కొన్ని అయిన ఓట్లు పడతాయి అనుకున్న బిజెపి సీన్ రివర్స్ అయ్యేసరికి పవన్ కళ్యాణ్ తో తమకి ఎలాంటి ఉపయోగం లేదు .

That party is good bye to Janasena

ఆయనతో పొత్తు పెట్టుకోవడం యూజ్ లెస్ అని భావించారట. అందుకే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్టు రీసెంట్ గా ఆ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మణ్ చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ తెలంగాణ లో బిజెపి పల్లకి,ఆంధ్రాలో చంద్రబాబు పల్లకి మోయడానికి తప్ప సొంత రాజకీయాలు చేయడం మానేసారని, ఆ పార్టీలు కేవలం పవన్ కళ్యాణ్ ని వాడుకొని వదిలేస్తున్నారని,ఈ అవమానాన్ని ఆయన ఎలా తట్టుకుంటారో అంటూ కొంతమంది ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు.

Join WhatsApp