Thatikonda Rajaiah into congress For Warangal Mp Ticket

Thatikonda Rajaiah: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత భారత రాష్ట్ర సమితి పార్టీ లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమి నుంచి బయటపడి ఎందుకు లోక్సభ అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించుకుంటూ ముందుకు సాగుతోంది గులాబీ పార్టీ. అయితే ఇలాంటి నేపథ్యంలోనే కొంతమంది అసంతృప్తి నేతలు బయటపడుతున్నారు.Thatikonda Rajaiah

Thatikonda Rajaiah into congress For Warangal Mp Ticket

తాజాగా స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనధిక్కరా స్వరాన్ని బయట పెట్టాడు. తాను పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కూడా… తన రాజీనామా పత్రాన్ని పంపినట్లు తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. భారత రాష్ట్ర సమితి పార్టీలో తనకు సరైన స్థానం లభించడం లేదని… కడియం శ్రీహరిని గెలిపించేందుకు చాలా కష్టపడ్డాను అని ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య చెప్పుకొచ్చారు.

Also Read: Etala Rajendhar: ఘర్‌ వాపసీ..గులాబీ గూటికి ఈటల ?

కానీ… తన కష్టాన్ని భారత రాష్ట్ర సమితి పార్టీ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే గులాబీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే త్వరలోనే తాటికొండ రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు వరంగల్ ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు… సమాచారం. వాస్తవానికి వరంగల్ ఎంపీ సీట్… ఎస్సీ కేటగిరి. తాటికొండ రాజయ్య కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడు. అటు వరంగల్ భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా… కడియం శ్రీహరి కూతురు లేదా, మరోసారి పసునూరి దయాకర్ కు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.

తాటికొండ రాజయ్య వర్సెస్ సర్పంచ్ నవ్య ఎపిసోడ్ నేపథ్యంలో… ఆయనకు స్టేషన్ ఘనపూర్ టికెట్ ఇవ్వలేదు కేసీఆర్. ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఇచ్చేందుకు నిరాకరణ తెలుపుతున్నారట కేసీఆర్. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గమే కాకుండా వరంగల్ మొత్తంగా తాటికొండ రాజకీయ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయట. దీంతో ఆయనను పట్టించుకోవడం లేదట గులాబీ బాస్. అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం అందుతుంది.Thatikonda Rajaiah

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిగా దొమ్మటి సాంబయ్య ఉన్నారు. అయితే తాటికొండ రాజయ్య పార్టీలో చేరితే అతనికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందట. ఈ మేరకు అన్ని చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. మరి దీనిపై దొమ్మటి సాంబయ్య ఎలా స్పందిస్తారు చూడాలి.

Join WhatsApp