The system of volunteers in Telangana A shock for Revanth

Telangana: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతోంది. ఇప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరికీ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తున్నారు. బస్సు యాత్రలు, రోడ్ షోలు చేస్తూ జనాల్లోకి వెళ్తున్నారు కేసీఆర్. Telangana

The system of volunteers in Telangana A shock for Revanth

కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను ఎదుర్కొనేందుకు దమ్ము లేక… ఫోన్ ట్యాపింగ్… కాలేశ్వరం లాంటి అంశాలను తెరపైకి తీసుకువస్తుంది కాంగ్రెస్. ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థలు తీసుకువస్తామని ప్రకటించింది కాంగ్రెస్. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… ఏపీలో ఉన్నట్లుగానే తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ తీసుకువస్తామని స్పష్టం చేశారు. Telangana

Also Read: Venkatesh: వెంకటేష్ కుటుంబానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ?

ఒకవేళ వాలంటీర్ వ్యవస్థ తీసుకువస్తే అందులో పనిచేసే వారంతా కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు. ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొంది. మొత్తం వైసిపి వారికి ఎక్కువగా పోస్టులు ఇచ్చారు. దీంతో వైసిపి పై దారుణంగా విమర్శలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే… తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది పూర్తిగా హరించుకుపోయింది. ఎక్కడ చూసినా గులాబీ పార్టీ నేతలపై అలాగే జర్నలిస్టులకు దాడులు జరుగుతున్నాయి. Telangana

కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడులు చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థలో కాంగ్రెస్ కార్యకర్తలను పెడితే… తెలంగాణ రాష్ట్రం మరో బీహార్ కావాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరింత ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే… ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. Telangana

Join WhatsApp