Jagan and KCR's aggression results of the Times Now Survey

Times Now Survey: ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అయినా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. Times Now Survey

There are no brakes for Jagan and KCR’s aggression results of the Times Now Survey

మరోసారి ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి జనాల మధ్యలో తిరుగుతున్నారు. ఆయనను ఓడించేందుకు ప్రతిపక్షాలు అయినా తెలుగుదేశం, జనసేన మరియు బిజెపి పార్టీలు ఏకమయ్యాయి. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన గులాబీ పార్టీ… పార్లమెంట్ ఎన్నికల్లో దుమ్ము లేపాలని చూస్తోంది. ఇంకా ఈ ఎన్నికల హడావిడి నేపథ్యంలోనే తాజాగా నేషనల్ మీడియా అయిన టైమ్స్ నౌ తమ సర్వే రిపోర్ట్ బయటపెట్టింది. టైమ్స్ నౌ ఆధ్వర్యంలో etg రీసెర్చ్ సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం… అధికార వైసీపీ పార్టీకి 19 నుంచి 20 పార్లమెంటు సీట్లు వస్తాయని తేలిపోయింది. Times Now Survey

Also Read: ABP-CVoter Opinion Poll: పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలలో ఆ పార్టీలు మునగడం పక్కా… సర్వే రిపోర్ట్ ఇదే

ఆటో తెలుగుదేశం పార్టీకి కేవలం 3 నుంచి 4 ఎంపీ స్థానాలు దక్కుతాయట. ఇక జనసేన మాత్రం అస్సలు ఖాతా తెరిచేలా కనిపించడం లేదు. బిజెపి పార్టీకి ఒక్కటంటే ఒక్కటే సీటు రానుందట. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖాతా తెరవలేదు. ఈ లెక్కల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికార వైసిపి పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతుందని తేలిపోయింది. మరి ఎన్నికల అయ్యే వరకు దీనిపై వేచి చూడాలి. అటు తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలపై సర్వే రిపోర్టును మరో సర్వే సంస్థ రిలీజ్ చేసింది.Times Now Survey

సివిక్ అనే సర్వే సంస్థ విడుదల చేసిన లెక్కల ప్రకారం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఏకంగా 8 ఎంపీ సీట్లు వస్తాయట. అటు కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 సీట్లు రానున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. బిజెపి పార్టీకి రెండు అటు ఎంఐఎం పార్టీకు ఒకటి రానుందట. ఈ సివిక్ సర్వే సంస్థ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన సర్వే రిపోర్ట్… నిజమైంది. వీరి రిపోర్టు ప్రకారమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. Times Now Survey

Join WhatsApp