Three Pawan Kalyans In Pitapuram Constitition

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ ఏకమయ్యారు. Pawan Kalyan

Three Pawan Kalyans In Pitapuram Constitition

మూడు పార్టీలు ఏకమై వైసీపీని ఓడించేందుకు వ్యూహరచనలు చేస్తున్నాయి. అయితే వీటన్నిటిని జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే ఎదుర్కొంటున్నారు. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని కూడా సర్వేలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలోనే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. ఈసారి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. Pawan Kalyan

Also Read: KCR: సీఎం జగన్ కోసం ఏపీలో కేసీఆర్ ప్రచారం…బాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఖాయమేనా ?

వైసిపి తరఫున వంగా గీత బరిలో ఉన్నారు. ఆమె కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో పోటాపోటీ నెలకొంది. అయితే ఎలాగైనా ఈసారి గెలుస్తాం అనుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. అదేంటంటే పిఠాపురం నియోజకవర్గంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఇద్దరు పవన్ కళ్యాణ్ లు తయారయ్యారు. అవును పిఠాపురం నియోజకవర్గంలో బకెట్ గుర్తుతో కోనేటి పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చాడు. Pawan Kalyan

గ్లాస్ గుర్తుతో కొణిదెలా పవన్ కళ్యాణ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరో గుర్తుతో కనుమూరి పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చాడు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో ముగ్గురు పవన్ కళ్యాణ్ లు ఉండటంతో జనాలు ఆగమవుతున్నారు. అసలైన పవన్ కళ్యాణ్ కు ఎలా ఓటెయ్యాలని ఆందోళన చెందుతున్నారు. అయితే ఇదంతా వైసిపి పని అని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి పిఠాపురంలో ఈజీగా గెలుస్తాం అనుకున్న పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చాయి.Pawan Kalyan

Join WhatsApp