Veera Shiva Reddy Joined in TDP

Veera Shiva Reddy: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి సమయం దగ్గర పడింది. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా ఎన్నికల మీదే ఫోకస్ పెట్టారు అయితే ఎన్నికల సమయం దగ్గర పడడంతో కొందరు రాజకీయ నేతలు పక్క పార్టీలకి పారిపోతున్నారు ఇంకొంతమంది నేతలు తిరిగి సొంత గూటికి చేరుకుంటున్నారు. అలా ప్రతిరోజు కూడా ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది ఈ మధ్య వరుసగా టీడీపీలో పలువురు నేతలు చేరుతూ వస్తున్నారు. ఇక ఇది ఇలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.

Veera Shiva Reddy Joined in TDP

కమలాపురం నియోజకవర్గం నుండి గతంలో ప్రాతినిథ్యం వహించారు వీరశివారెడ్డి ఆయనతో పాటుగా ఆదోనికి చెందిన ఏసీ శ్రీకాంత్ రెడ్డి అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాస్ తదితరులు టిడిపిలో చేరారు ఇక ఇది ఇలా ఉంటే కడప జిల్లా కమలాపురం నియోజకవర్గానికి చెందిన శివారెడ్డి తొలినాళ్లలో టిడిపిలోనే తన రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టారు 1994లో మొదటిసారి టిడిపి అభ్యర్థిగా కమలాపురం నుండి ఆయన బరిలోకి దిగారు. తర్వాత 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.

Also Read: SmartPhones: 2024లో లాంచ్ అయి మార్కెట్లో దూసుకుపోతున్న మొబైల్స్..!

2004లో కూడా విజయం దక్కలేదు 2009లో కాంగ్రెస్లో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు ఇప్పుడు మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా 1994 నుండి ఈయన రాజకీయ ప్రస్థానం మొదలైంది రకరకాలుగా మార్పులు జరిగాయి. అయితే 2019 ఎన్నికల టైం లో వైసీపీలో చేరారు కానీ తగినంత ప్రాధాన్యత లేదని చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగానే ఉంటున్నారు అందుకని ఇప్పుడు మళ్ళీ మార్పు కోసం టిడిపిలో చేరారు టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది (Veera Shiva Reddy).

Veera Shiva Reddy Joined in TDP
Join WhatsApp