vidadala rajini win as MLA Confirmed

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా విడదల రజనీ గెలుపు తథ్యమని సర్వేలన్నీ చెబుతున్నాయి. దేశంలోని ప్రముఖ ఛానళ్లు, మీడియా సంస్థలన్నీ కూడా సర్వేలు చేసిన నివేదికలను నెట్టింట పెడుతున్నాయి. ఎవరినోట విన్నా ఇదే మాట, పదేపదే వినిపిస్తోంది. గుంటూరు పశ్చిమలో విడదల రజనీ విజయాన్ని ఆపలేరని, అందుకు ఎన్నో ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయని అంటున్నారు.

ముఖ్యంగా మహిళా అభ్యర్థి కావడమే మొదటి గెలుపునకు కారణమని అంటున్నారు. గుంటూరు పశ్చిమ పరిధిలో మహిళా ఓటు బ్యాంకు ఎక్కువ కావడం ఆమె విజయానికి ప్రధాన కారణం కాగలదని అంటున్నారు. ఎందుకంటే మహిళలంతా కూడా జగనన్న పరిపాలనకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారనేది అందరికీ తెలిసిన సత్యం. ఈ క్రమంలో ఈ ఓట్లన్నీ వన్ సైడెడ్ గా విడదల రజనీ ఖాతాలో పడటం ఖాయమని అంటున్నారు.

మరో ప్రధాన ఫ్యాక్టర్ ఏమిటంటే గుంటూరు పశ్చిమ ఆడపడుచుగా ప్రజలందరూ ఆదరించడం అన్నింటికన్నా పెద్ద అసెట్ గా చెబుతున్నారు. ఆరోగ్య శాఖామంత్రిగా గుంటూరు ప్రభుత్వాసుపత్రిని అభివ్రద్ధి చేయడం, ఇవన్నీ ఒక సెంటిమెంటుగా మారి వర్కవుట్ అయ్యే అవకాశాలున్నాయని సర్వేలు చెబుతున్నాయి.

అన్నింటికన్నా మించి సర్వేల సారాంశం ఏమిటంటే, ఆల్రడీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రిగా చేయడం, చేసిన అభివ్రద్ధి పనులు, ప్రజాసేవలో సిన్సియర్ గా ఉండటం, అసెంబ్లీ సెషన్స్ లో బాధ్యతగా పాల్గొనడం, సమస్యలపై సొంతంగా, ధైర్యంగా మాట్లాడటం ఇలా ఎన్నో అంశాలు ఆమెకు కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికి కూడా ఆమె ప్రసంగాలు అందరిలో చైతన్యాన్ని తీసుకువస్తున్నాయి.

ఇకపోతే సామాజిక సమీకరణాలన్నీ విడదల రజనీకి అనుకూలంగా ఉండటంతో ఆమె గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. అలాగే రాజకీయ ఈక్వేషన్స్ కూడా తనకు అనుకూలంగా ఉన్నాయి. ప్రచారంలో ముందడుగు, యంగ్ పొలిటిషియన్ గా ఒక ఐడెంటిటీ, వార్డుల్లో విస్త్రతంగా పర్యటన, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యూహాత్మకంగా పావులు కదపడం ఇలా ప్రతీ అంశంలో ఆమె దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి గళ్లా మాధవికన్నా పది అడుగులు ముందే ఉంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే ప్రత్యర్థి గళ్లా మాధవిని చూస్తే, ఏం చేయాలో తెలీక చేష్టలుడిగి చూస్తున్నారని అంటున్నారు. తమ సామాజికవర్గంతోనే తిరుగుతున్నారు. కొత్తవాళ్లతో కలిసి వెళ్లడం లేదు. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలతో సున్నం పెట్టుకోవడం పెద్ద మైనస్ గా మారింది. అలాగే ఆమె ప్రసంగాలు కూడా చప్పగా సాగుతున్నాయి. ఒక అవగాహన లేకుండా నడిపించడంతో పార్టీ క్యాడర్ కూడా జారిపోతోంది. ఇలా అన్నివైపుల నుంచి విడదల రజనీకి అనుకూలంగా ఉండటంతో ఆమె విజయం దాదాపు ఖరారైపోయిందని అంటున్నారు.

Join WhatsApp