Vijayamma left YS Sharmila & Supported Jagan

YS Sharmila: వైయస్ షర్మిల ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చింది. ఈమె రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంది. ఈ మధ్యనే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పార్టీ పెట్టి కొద్దిరోజులు హడావిడి చేసింది. కానీ చివరికి పార్టీలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులే కరువయ్యారు.దాంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను అన్నప్పటికీ కాంగ్రెస్ లోని కొంతమంది దీన్ని వ్యతిరేకించడంతో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయలేకపోయింది. కానీ ఎన్నికల బరి నుండి తప్పుకొని కాంగ్రెస్ కి తన మద్దతు ఇచ్చింది.అయితే తెలంగాణలో ప్రజలు తనని ఆదరించకపోవడంతో మళ్లీ తన సొంతగూడు అయిన ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళింది.

Vijayamma left YS Sharmila & Supported Jagan

ఇక ఆంధ్రాలో సొంతంగా పార్టీ పెడుతుందని ప్రచారం జరిగినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పెరిగిన సాన్నిహిత్యం వల్ల ఆంధ్రా లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మారిపోయింది.. ఇక ఎప్పుడైతే ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల అడుగు పెట్టిందో అప్పటి నుండి అధికార పార్టీపై చిర్రుబుర్రులాడింది . ఈమె తన సొంత అన్న జగన్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాల్లో దూసుకుపోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరాక ప్రెస్ మీట్లు పెడుతూ తన కుటుంబం చీలిపోవడానికి ప్రధాన కారణం తన అన్న జగనే నని ఎన్నో సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

Also Read: TDP: జనసేనకు 25-30 సీట్లే ఇచ్చి..పవన్‌ గొంతు నొక్కుతున్న బాబు ?

అయితే షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లి తన అన్నపై ఇంత ధైర్యంగా విమర్శలు చేయడానికి తన తల్లి విజయమ్మ తన దగ్గర ఉందనే నమ్మకంతోనే.కానీ తాజాగా మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం విజయమ్మ తన కూతురు షర్మిలను వదిలేసి తన పూర్తి మద్దతు తన కొడుకు జగన్ కి ఇవ్వాలని నిర్ణయించుకుందట. ఇక ఇదే విషయాన్ని షర్మిల తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని వాపోయిందట. అయితే ఈ విషయం బయటపడడంతో ఎల్లో మీడియా ఈ విషయాన్ని వైరల్ చేస్తుంది.అయితే షర్మిల ఎన్ని నిందలు తనపై వేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడడం లేదు. చెల్లిని ఏమీ అనడం లేదు. (YS Sharmila)

Vijayamma left Y.S. Sharmila and supported Jagan

కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ గతంలో తన చిన్నాన్న ని హత్య చేసింది ఇప్పుడు తన చెల్లిని అడ్డుపెట్టుకొని కుట్ర రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుందని మాట్లాడారు. అయితే వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వలేక తన భర్త పెట్టిన తన కొడుకు ముందుకు తీసుకు వెళ్తున్న వైయస్ఆర్సీపీ పార్టీకే మద్దతు ఇవ్వాలి అని నిర్ణయించుకుందట.అంతే కాదు త్వరలోనే తన కొడుకు జగన్మోహన్ రెడ్డి తరఫున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కూడా చేయబోతుందని తెలుస్తోంది. ఇక ఈ విషయం షర్మిలకు మింగుడు పడడం లేదని కూడా మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మరి తల్లి విజయమ్మ ఉందనే భరోసాతో అన్న మీద విమర్శలు చేసిన షర్మిల పరిస్థితి ఏంటో అని ఆంధ్ర రాజకీయాల్లో కొత్త చర్చలు మొదలయ్యాయి.(YS Sharmila)

Join WhatsApp