Vijayasai Reddy Comments On Telangana Congress Government

Vijayasai Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. గత పది సంవత్సరాలుగా ప్రతిపక్ష పార్టీ మాటలు పెద్దగా వినబడలేదు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత… ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య వేడి వాడి చర్చలు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు ఎదురు దాడులు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేసినా… వెంటనే గులాబీ పార్టీ ప్రశ్నిస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతోంది.Vijayasai Reddy

Vijayasai Reddy Comments On Telangana Congress Government

ఇలాంటి తరుణంలో వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలకు దారి తీశారు. అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బాంబు పేల్చారు విజయసాయిరెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి రావాలని చూసిందని… కానీ పది సంవత్సరాలపాటు వారికి తెలంగాణ ప్రజలు అధికారం ఇవ్వలేదని చురకలాంటించారు. ఎన్నో అబద్ధాలు చెప్పి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన వెల్లడించారు.

Also Read: Nara Bhuvaneshwari: కేశినేనికి షాక్..ఎంపీ బరిలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ?

కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదని… కచ్చితంగా కుప్పకూతుందని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హిట్ ఎక్కాయి. అయితే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమేనని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటిది. ఆ పార్టీలో ఎవరు ఎప్పుడు ఇలా మాట్లాడుతారో ఎవరికి అర్థం కాదు.

దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉన్న మంత్రులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్తే ఖచ్చితంగా బట్టి లేదా ఉత్తంకుమార్ రెడ్డి ఎవరో ఒకరు ఉంటున్నారు. అలాగే ఈ కార్యక్రమం జరిగిన బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి… సీఎం రేవంత్ రెడ్డి తో కూడా పాల్గొంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… తాను తెలంగాణలో నెంబర్ 2 అంటూ ఈమధ్య వ్యాఖ్యానించారు. ఇలాంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఆయన సొంతగా ఎలాంటి నిర్ణయం తీసుకున్న… మిగతా మంత్రులు కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే.

లేకపోతే..బట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి… ముగ్గురు కలిసి… రేవంత్ రెడ్డి పై తిరుగుబాటు చేసిన ఛాన్స్ ఉంటుంది. దీంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కోలుతుందో తెలియని పరిస్థితి ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Join WhatsApp