Voters Support for YCP Vidadala Rajini in Guntur Paschima

YCP: గుంటూరు పశ్చిమలో మౌలిక సౌకర్యాల కల్పనపై వైసీపీ అభ్యర్థి విడదల రజనీ దృష్టి సారించారు. ముఖ్యంగా డ్రైనేజీ, తాగునీరు, ఎక్కడపడితే అక్కడ అడ్డదిడ్డంగా కలిసిపోయిన కరెంటు తీగల సమస్యను పరిష్కరిస్తామని అందరికీ చెబుతున్నారు. దీంతో ప్రజల్లో ఒక చైతన్యం వస్తోంది. దశాబ్దాల తరబడి స్థానికంగా ఉన్న సమస్యలపై 2014 ,2019 లో రెండుసార్లు పదేళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేల వల్లా కాలేదు. అంతకుముందు 2009లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ వారి వల్లా కాలేదు.

Voters Support for YCP Vidadala Rajini in Guntur West

ఇలా 15 ఏళ్లు గడిచిపోయాయి. ఎన్నికల సమయానికి రావడం, అరచేతిలో వైకుంఠం చూపించడం, ఇప్పటిలా అలవికాని హామీలివ్వడం, తర్వాత అడ్రస్ లేకుండా గయాప్ కావడం, ఇంకా చెబితే ఎక్కిన కారు దిగకుండా వెళ్లిపోవడం ఇదే దశాబ్దాలుగా జరుగుతోంది తప్ప, సమస్యలను పరిష్కరించే నాథుడే కనిపించ లేదు. ముఖ్యంగా నగర కార్పొరేషన్ నుంచి కార్పొరేటర్లు ఎంత ప్రయత్నించినా ఎమ్మెల్యే సహకారం లేకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది.

అదే మంత్రి విడదల రజనీ అయితే ఆరోగ్య మంత్రిగా ఏం చేస్తున్నారో కళ్లతో చూస్తున్నామని అంటున్నారు. తను యువ నేతగా ఉండటం, చురుకుగా అన్నింటా దూసుకుపోవడం, అలాగే డైనమిక్ గా నిర్ణయాలు తీసుకోవడం…వీటన్నింటి దృష్ట్యా, ప్రతిపక్షాలు ఎవరెన్ని పన్నాగాలు పన్నిలా, విడదల రజనీ గెలుపును ఆపేలా కనిపించడం లేదు.

ముందు ప్రజల సమస్యలు వినాలి. కనీసం ఆ పని కూడా ఇంతవరకు పదేళ్లు పాలించిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేయలేకపోయారని అంటున్నారు. అందులో 2014లో అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా ఉండటాన్ని అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అలాగే 2009లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచారు. అప్పుడు కూడా ఆ పార్టీ అధికారంలో ఉంది. అయినా సరే, గుంటూరు పశ్చిమకి చేసింది శూన్యమని అంటున్నారు.

పదేళ్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించాం. ఇంక వద్దు బాబు వద్దు, నీ మాటలు నమ్మం చంద్రబాబు అంటున్నారు. నమ్మించి మోసం చేయడంలో నిన్ను మించినవాడు లేడని కూడా అంటున్నారు. ఈరోజున ఎన్నికల ముందు ఇన్ని చేసేస్తానని ప్రగల్భాలు పలికినవాళ్లు ఆనాడు అధికారంలో ఉండగా ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అందుకే 2024లో ఈాసారి వైసీపీకి ఓటువేసి విడదల రజనీ ని గెలిపిస్తామని పబ్లిక్ గానే చెబుతున్నారు. అలాగే ఇక ఎన్ని రాజకీయ కుట్రలు పన్నినా వైసీపీ గెలుపును గుంటూరు పశ్చిమలో ఆపలేరనే భావన సర్వత్రా వినిపిస్తోంది.

Join WhatsApp