What is happening in BRS


BRS: తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటి నుంచి మొదటి రెండు పర్యాయాలు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిందే వేదం అన్నట్టు పార్టీలో ఉన్న వారంతా భావించేవారు. కెసిఆర్ తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకుంది కేటీఆర్ మాత్రమే. అది కూడా అధికారంలో ఉన్నన్ని రోజులు కెసిఆర్ ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ మరో ముఖ్యమంత్రిలా ఉండేవారు. సొంత నిర్ణయాలు తీసుకోవాలంటే ఇంకో ఏ మంత్రి కూడా సాహసం చేసేవారు కాదు. హరీష్ రావు కూడా కేసీఆర్, కేటీఆర్ తర్వాతే ఉండేవారు. కానీ ఫాలోయింగ్ లో చూసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత హరీష్ రావుకి ఎక్కువ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఆయన ముందుండి నడిపించారంటే తప్పనిసరిగా ఆ సీటు గెలిపించుకుని తీరేవారు.

What is happening in BRS

అంతటి క్రేజ్ ఉన్నటువంటి హరీష్ రావు ప్రతిసారి అణిచివేతకు గురయ్యారని కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. అది ఇప్పటికి బీఆర్ఎస్ లో కొనసాగుతుందని చెప్పవచ్చు. అది ఎలాగయ్యా అంటే. గతంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ బై పోల్స్ లో ఈ నియోజకవర్గాలకు హరీష్ రావునే బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఇన్చార్జిగా నియమించిన విషయం తెలిసిందే. కానీ ఆ రెండు నియోజకవర్గాలు ఓడిపోయారు. ఈ విషయం ముందే తెలిసి కేసీఆర్ హరీష్ రావును నియమించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రం కేటీఆర్ కు ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పారు. అక్కడ బిజెపిని ఓడించడం కోసం కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగిన బీఆర్ఎస్ గెలుస్తామనే భరోసాతోనే కేటీఆర్ కు బాధ్యతలు అప్ప చెప్పారని అప్పట్లో వార్తలు వినిపించాయి. (BRS)

Also Read: Tdp Vs Ycp: ఏపీలో టీడీపీ, వైఎస్సార్సీపీ కండోమ్ రాజకీయాలు!

ఈ విధంగా హరీష్ పై బీఆర్ఎస్ లో తెలియని రాజకీయ కుట్ర కోణం జరిగిందని బీఆర్ఎస్ లోని ఒక వర్గం వారు అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ విషయం కూడా తేటతెల్లమవుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉంది. కాంగ్రెస్ చేసే తప్పులను చూపించడంలో, ప్రతి ఒక్కదానికి హరీష్ రావే ముందుకు వస్తున్నారు. కేటీఆర్ మాత్రం వెనకనే ఉంటున్నారు. పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేదు. కానీ హరీష్ రావే అన్ని తానై నడిపించారు.

What is happening in BRS

ఈ విధంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించినటువంటి కేటీఆర్ ప్రభుత్వం పడిపోయాక ప్రశ్నించకపోవడం చూస్తుంటే, హంగు ఆర్భాటాలు, ఆనందాలకు ఏమో కేటీఆర్ ముందుకు వస్తారు, తిట్లు, చివాట్లు, కొట్లాటలకు హరీష్ రావును ముందు పెడతారు అంటూ బీఆర్ఎస్ లోని ఓవర్గం నాయకులు అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చురుగ్గా ఉన్నారో, ఇప్పుడు అలాగే ముందుకు వచ్చేది ఉంటే ప్రతి కొట్లాటలో ఆయనే ముందుండాలి. కానీ ఆయన వెనక్కి వెళ్తూ హరీష్ రావును ముందు పెడుతూ ఆయన వెనుక కూర్చోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చాలా మందికి అర్థం కావడం లేదు.(BRS)

Join WhatsApp