Will KCR go to jail

KCR: తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరగబోతుందో అంచనా వేయడం కూడా కష్టంగా మారిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటినుండి 10 ఏళ్లలో బిఆర్ఎస్ చేసిన అవినీతిని ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. ఇప్పటికే కవిత లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే కేసీఆర్ కూడా కూతురు కవిత లాగే అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడపబోతున్నారు అంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెప్పారు.

Will KCR go to jail

ప్రస్తుతం ఈయన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక వేణు స్వామి చెబితే చాలామందికి ఒక నమ్మకం ఉంటుంది. నిజంగానే అది జరుగుతుందని.ఎందుకంటే ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ లైఫ్ లో ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరిగింది. అయితే వేణు స్వామి స్వయంగా కేసీఆర్ కూడా జైలు జీవితం గడపబోతున్నారు అంటూ మాట్లాడడంతో ఈ విషయం విని అందరు షాక్ అవుతున్నారు. ( KCR)

Also Read: Pawan kalyan: పిఠాపురంలో ఓటుకు పదివేలు…ఫ్యామిలీకి లక్ష….!?

ఇక అసలు విషయంలోకి వెళ్తే..ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు,వ్యాపార వేత్తలకు సంబంధించిన జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యారు. అయితే అలాంటి ఈయన కల్వకుంట్ల కవిత అరెస్ట్ అవుతుందని,చంద్రబాబు నాయుడు కూడా జైలు జీవితం గడుపుతారని చెప్పారు.ఇక అదే ఇంటర్వ్యూలో కేసీఆర్ కూడా జైలు జీవితం గడుపుతారని చెప్పారు.

Will KCR go to jail

ఇక రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కేసీఆర్ గురించి ప్రశ్న ఎదురవగా కేసీఆర్ కూడా కచ్చితంగా జైలు జీవితం గడపక తప్పదు.అయితే ఏ కేసులో ఇరుక్కుంటారని యాంకర్ అడగగా అది ఏ కేసో చెప్పలేను కానీ ఖచ్చితంగా ఆయన జైలుకు వెళ్తారు అంటూ చెప్పి సంచలనం సృష్టించారు.దీంతో వేణు స్వామి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారడంతో చంద్రబాబు లాగే కేసీఆర్ కూడా జైల్లోకి వెళ్లబోతున్నారా.. అని కామెంట్లు పెడుతున్నారు.మరి చూడాలి కేసీఆర్ గురించి వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు ఎంతవరకు నిజమవుతాయో.( KCR)

Join WhatsApp