విశాఖ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బొత్సా ఝాన్సీ బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె విజయానికి ప్రధానంగా ఎనిమిది కారణాలు బలంగా పనిచేస్తున్నాయని అంటున్నారు. మరోవైపు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ లో ఒక్కటి కూడా లేదని అంటున్నారు. అతను ఏకారణం చేత గెలుస్తాడో కూడా చెప్పలేకపోతున్నారు.ఇంతకీ బొత్సా ఝాన్సీ విజయానికి ఆ ఎనిమిది కారణాలు ఏమిటంటే…

 1. మొదటి కారణం…
  ..బొత్సాఝాన్సీ ప్రసంగాలు

బొత్సా ఝాన్సీ తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. సూటిగా, స్పష్టంగా చెబుతున్నారు.
అంతేకాదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. ప్రతీ చిన్న అంశాన్ని ఎంతో ఉన్నతంగా ఆలోచించి మాట్లాడుతున్నారు. ప్రజలకు మంచి జరుగుతుందంటే, మొదటి వరసలో నేనే ఉంటానని అంటున్నారు.

 1. రెండో కారణం…
  గతంలో ఎంపీగా చేసిన అభివృద్ధి

గతంలో విజయనగరం, బొబ్బిలి ఎంపీగా చేసినప్పుడు చేసిన మంచి పనులు ఆమెకు ఇప్పుడు ప్లస్ గా మారాయి. ఎన్నో అభివృద్ధి పనులు ఆమె హయాంలోనే జరిగాయి. రైల్వే గేట్ల దగ్గర నుంచి విశాఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పెన్షన్ సమస్యలు, విశాఖ పోర్టు సమస్యలు ఎన్నో పరిష్కారమయ్యాయి.

 1. మూడో కారణం
  ఉత్తరాంధ్ర ఆడపడుచుగా గుర్తింపు

ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఆడపడచుగా ఆమెను ప్రజలు ఆదరించడం, ఈమె మా బిడ్డ, మా ఇంటి బిడ్డ అని భావించడం, అతిపెద్ద ఎచీవ్ మెంట్ గా భావిస్తున్నారు. ఈ ఒక్క సెంటిమెంట్ ఆమెకు ఎంతో ప్లస్ గా మారింది.

 1. నాలుగో కారణం
  …. పార్లమెంటులో ప్రసంగాలు:

చాలామంది ఎంపీల్లా మట్టి విగ్రహాల్లా కూర్చోకుండా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఆమె గుర్తింపు పొందారు. దేశంలో నెలకొన్న ఎన్నో సమస్యలపై ఆమె తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యక్తీకరించారు. అంతేకాదు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అంశాన్ని కూడా తొలుత ఆమె ప్రస్తావించారు.

 1. ఐదో కారణం
  విశాఖ కోసం పోరాటం

తను రెండుసార్లు ఎంపీగా గెలిచి కూడా తనేదో బొబ్బిలి, విజయనగరానికే పరిమితం అనుకోలేదు. మొత్తం ఉత్తరాంధ్ర సమస్యలపై గొంతెత్తారు. అలా ఆనాడే విశాఖ పట్నం సమస్యలపై పోరాడి, ఎన్నింటినో పరిష్కరించారు. ఆనాడే విశాఖ ఉక్కు కర్మాగారం, విశాఖ పోర్టులను ప్రస్తావించారు.

 1. ఆరవ కారణం
  సామాజిక వర్గం బలం..

.ప్రధానంగా విశాఖ పార్లమెంటు పరిధిలో 2.3 లక్షలున్న కాపులు వన్ సైడెడ్ గా బొత్సా ఝాన్సీకి మద్దతు పలుకుతున్నారు. ఇక సామాజికవర్గాల వారీగా జగనన్న ఇచ్చిన సీట్లు కూడా ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇన్నాళ్లకి తమ సామాజికవర్గాలకి జగనన్న రాజ్యాధికారాన్ని కట్టబెట్టాడని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ నమ్ముతున్నారు. ఉత్తరాంధ్రలో కూడా అవే ఈక్వేషన్లు పనిచేస్తున్నాయి.

 1. ఏడో కారణం …
  జగనన్న సంక్షేమ పథకాలు

రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, 25 పార్లమెంటు సభ్యులు అందరూ కూడా 90శాతం వీటిపైనే ఆధారపడి ఉన్నారు. అంత గొప్పగా సంక్షేమ పథకాల అమలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అందుకే ఇది పేదవాడికి-పెత్తందార్లకి మధ్య పోరాటంగా సీఎం జగన్మోహనరెడ్డి అభివర్ణిస్తున్నారు. ఏ మాత్రం తేడా జరిగినా ఆంధ్రరాష్ట్రం చీకటైపోతుంది.

 1. ఆఖరుగా ఎనిమిదో కారణం …
  తెలుగుదేశం అభ్యర్థి శ్రీ భరత్ పోటీ పడలేకపోవడం

తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా శ్రీ భరత్ కి రాజకీయానుభవం లేదు. అంతేకాదు మామ రికమండేషన్ తో, బలవంతంగా సీటు తెచ్చుకున్నాడు. అంతేకాదు సామాజిక సమస్యలపై అవగాహనలేదు. పేద, మధ్యతరగతి ప్రజల సమస్యలు తెలీదు.
గీతం యూనివర్శిటీ చుట్టూ అలముకున్న అవినీతి ఆరోపణలు, ఆక్రమణలతో ఉన్న పేరు పోగొట్టుకున్నాడు. సామాజికవర్గ నేతలెవరూ కలిసి రావడం లేదు. అందరితో సున్నం పెట్టుకున్నాడు.

మరోవైపు బొత్సా ఝాన్సీ సీనియర్ అయ్యారు. అంతేకాదు రెండుసార్లు ఎంపీగా గెలిచారు. పార్లమెంటులో తన ప్రతిభను నిరూపించుకున్నారు. దీంతో శ్రీ భరత్ ఆమె ముందు సమ ఉజ్జీగా లేడు. విశాఖ ఎంపీ సీటు శ్రీ భరత్ కి ఇచ్చి చంద్రబాబు వ్యూహాత్మక తప్పు చేశాడని ఇప్పుడందరూ నెత్తీ నోరు కొట్టుకుంటున్నారు.

ఇలా ప్రధానమైన ఎనిమిది కారణాలతో వైసీపీ ఎంపీ బొత్సా ఝాన్సీ గెలుపు ఇక నల్లేరు మీద నడకే అంటున్నారు. కళ్లు మూసుకుని గెలుస్తారని అంటున్నారు.

Join WhatsApp