YCP Treats Sharmila as Soniamma adopted daughter

YCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ ఏపీలో వెలువడే ఛాన్స్ ఉంది. ఈ మీద కొన్ని పార్టీలు ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్ లో గత పది సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్లీ పుంజుకోబోతుంది. దీనికి ముఖ్య కారణం వైఎస్ షర్మిల.

YCP Treats Sharmila as Soniamma adopted daughter

వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా ఇటీవల నియామకమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు మొన్న పార్టీ బాధ్యతలను కూడా చేపట్టారు షర్మిల. అయితే షర్మిల పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత… మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు. ఇతర పార్టీల నేతలు తిట్టనని తిట్లు జగన్మోహన్ రెడ్డిని షర్మిల తిట్టారు. దీంతో వైసిపి నేతలు కూడా వైయస్ షర్మిల కు కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు.

సజ్జల రామకృష్ణ నుంచి వైసీపీ ఎమ్మెల్యేల వరకు అందరూ షర్మిల తిట్టడం.. ఆమెను విమర్శించడం కొనసాగిస్తున్నారు. కొంతమంది అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఎలా పుట్టావు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక తాజాగా వైసిపి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి… కూడా వైయస్ షర్మిలపై విరుచుకుపడ్డారు. రాజశేఖర్ రెడ్డి కడుపున పుట్టి ప్రత్యర్థుల కోసం పనిచేస్తుందని షర్మిలపై మండిపడ్డారు.

Also Read: AP: ఏపీలోని నాలుగు పార్టీలను ఏలుతున్న ఎన్టీఆర్, YSR కుటుంబ సభ్యులు.. ?

అంతేకాకుండా వైయస్ షర్మిలను వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా కాకుండా సోనియమ్మ పెంపుడు కూతురుగా మేము చూస్తామని రాజమల్లు సంచలనం కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇకనుంచి పెంపుడు కూతురుగా మేము పిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల మారిపోయాయి. (YCP)

Join WhatsApp