YS Jagan Mohan Reddy is richest cm in india

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారపక్షం అలాగే ప్రతిపక్ష పార్టీల మధ్య పోటాపోటీ ప్రచారం నెలకొంది. జనసేన, తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ఈ మూడు పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు సిద్ధమయ్యాయి. CM Jagan

YS Jagan Mohan Reddy is richest cm in india

కానీ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ మూడు పార్టీలకు తలవంచకుండా… సింహంల ముందుకు వెళ్తున్నారు. బస్సు యాత్రలు అలాగే సభలు నిర్వహించుకుంటూ ఏపీ ప్రజల మన్ననలను పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ నేపథ్యంలోనే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం లో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన స్వయంగా నామినేషన్ వేయకుండా… నా కుటుంబ సభ్యుల తరఫున నామినేషన్ వేయించారు జగన్మోహన్ రెడ్డి. CM Jagan

Also Read: Chiranjeevi: చంద్రబాబు కోసం చిరంజీవి ప్రచారం…ముళ్ల పందులు అంటూ జగన్‌ ట్రోలింగ్‌ ?

అయితే ఈ సందర్భంగా ఎన్నికల అధికారులకు జగన్మోహన్ రెడ్డి అప్పగించిన అఫిడవిట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు.. వాటి వివరాలు తెలుసుకుందాం. ఇక ఆ లెక్కల ప్రకారం…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు 41% పెరిగాయి. 2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఏకంగా 41% జగన్మోహన్ రెడ్డి అసలు పెరిగినట్లు తన అఫీటవిట్ లో స్పష్టం చేశారు. సీఎం జగన్ మరియు ఆయన సతీమణి వైయస్ భారతికి 774.88 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. CM Jagan

అలాగే అందులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చే రాస్తులు 602.46 కోట్లు ఉన్నాయి. కాగా స్థిరాస్తులు 103.71 కోట్లు ఉన్నాయని తెలిపారు. ఇక వైయస్ భారతి వద్ద 5 కోట్లు విలువచేసే నగలు ఉన్నాయి. అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి పై 26 కేసులు ఉన్నాయి. గతంలో 449 కోట్లు ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 774 కోట్ల రూపాయలకు ఎగబాకాడు. కాగాయి తన ఆస్తిలో 82 కోట్ల రూపాయలను వైఎస్ షర్మిలకు అప్పుగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి.CM Jagan

Join WhatsApp