YS Sharmila in the ring as MP from Kadapa

Ys Sharmila: ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా మారిపోయాయి. ఇటీవల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవు తున్నాయి. ముఖ్యంగా ఏపీలో పార్లమెంట్ ఎన్నికల తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. అటు కూటమి అభ్యర్థులను కూడా ఫైనల్ చేశారు. Ys Sharmila

YS Sharmila Contest as MP from Kadapa

దీంతో ఏపీ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది. రేపు కాంగ్రెస్ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. వైయస్ షర్మిల కు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట. అది కూడా కడప నియోజకవర్గం నుంచి ఎంపీగా వైయస్ షర్మిలను నిలబెట్టేందుకు రంగం సిద్ధం చేసిందట కాంగ్రెస్ పార్టీ. Ys Sharmila

Also Read: Congress: కాంగ్రెస్ పార్టీలోకి… 16 మంది BRS ఎమ్మెల్యేలు ?

జగన్మోహన్ రెడ్డి పార్టీని దెబ్బ కొట్టేందుకు.. షర్మిల అయితేనే కరెక్ట్ గానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుందట. అందుకే కడప నియోజకవర్గం నుంచి ఎంపీగా షర్మిలాను బరిలోకి దింపుతున్నారట. కడప ఎంపీగా వైసిపి పార్టీ నుంచి అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన వైఎస్ వివేకా కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో వైయస్ వివేక కేసును వాడుకొని..కడప ఎంపీగా షర్మిల గెలవాలని చూస్తున్నారట. Ys Sharmila

సెంటిమెంట్ రాజకీయాలు రగిల్చి… ఎలాగైనా ఆ సీటు కొల్లగొట్టాలని భావిస్తున్నారట. ఒకవేళ కడప ఎంపీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే… దాదాపు జగన్మోహన్ రెడ్డిని ఓడించినట్టుగానే… భావిస్తామని కాంగ్రెస్ అనుకుంటోఉందట. అయితే షర్మిల ఎంపిక అనే కాకుండా మరొక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. మంగళగిరి నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. దీనిపై రేపు క్లారిటీ రానుంది. Ys Sharmila

Join WhatsApp