Ys Sharmila Influence On AP Elections

YS Sharmila: ఏపీ రాజకీయాలు ఎప్పుడూ చాలా రసవరత్తరంగానే ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయి. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో.. ఏపీ రాజకీయాలు చాలా హీటేక్కాయి. టికెట్ల కోసం నేతలు పాకులాడుతుంటే… రాని వారు.. ఇతర పార్టీల్లోకి జంప్‌ అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీ నుంచి టీడీపీ, జనసేన పార్టీల్లోకి వెళ్లారు.

YS Sharmila Influence On AP Elections

అయితే…నాలుగు రోజుల కిందట వైయస్ షర్మిల ఏపీ రాజకీయాల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏపీ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల తెలుగు రాష్ట్రాల్లో బాగా సుపరిచితురాలు. YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైయస్ షర్మిల కొత్త భూమిక పోషించబోతున్నారు. తెలంగాణ ప్రజల కోసం నేనున్నాను అంటూ, వైయస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) పెట్టి పాదయాత్ర చేసింది.

Also Read: CM Revanth Reddy: కాంగ్రెస్‌లోకి నలుగురు BRS ఎమ్మెల్యేలు ?

అలాగే, BRS నాయకులను బండ బూతులు తిట్టిన పెద్దగా ఆధారంగా రాకపోవడంతో తన పార్టీని ఎన్నికల టైం లో పోటీ చేయకుండానే కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి అందరికి తెలుసు. అయితే, షర్మిలను కాంగ్రెస్ పెద్దలు ఏపీ పీసీసీ చీఫ్ చేసిన సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఏపీలో షర్మిల వల్ల ఎవరికి నష్టం అనేది ఊహాగానాలు మొదలయ్యాయి.

YS Sharmila Influence On AP Elections

ఏపీ కాంగ్రెస్ కు షర్మిల సారథ్యం వహించడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు తో పాటు, దళితులు, మైనార్టీలు, క్రైస్తవుల వల్ల వైయస్సార్ కాంగ్రెస్(YSRCP) పార్టీ దెబ్బతిని అవకాశాలు ఉన్నాయని మెండుగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే, వైయస్సార్ ను అభిమానించే ఏపీ కాంగ్రెస్ మెజారిటీ నాయకులంతా జగన్ తో ఉన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అనుకున్నంత సపోర్ట్ చేయడం లేదని వీళ్లు లోలోపల కుములుతున్నారన్న చర్చ జరుగుతుంది. వాళ్లంతా కాంగ్రెస్ పార్టీలోకి జంపు చేసి అవకాశం ఉంది. (YS Sharmila)

Join WhatsApp