Ys Sharmila May Contest From Mangalagiri

Ys Sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ లో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో ఏ క్షణమైనా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. ఏమాత్రం వేరే పార్టీకి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని దూసుకుపోతున్నాయి. జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్నాయి.Ys Sharmila

Ys Sharmila May Contest From Mangalagiri

ఇటు అధికార వైసిపి పార్టీ సిద్ధం పేరుతో సభలు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్తోంది. మరోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇక బిజెపి పార్టీ ఏదో ఒక పార్టీతో కలిసి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వైయస్ షర్మిల లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో చాలా డిఫరెంట్ గా ఉంది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అయిన తర్వాత… కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తయారైందన్నమాట వాస్తవం. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల వైసిపి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ మళ్లీ వైసీపీలో చేరారు.Ys Sharmila

Also Read: Pawan Kalyan: చంద్రబాబుకు షాక్‌..టీడీపీకి పవన్‌ గుడ్‌ బై ?

సీఎం జగన్మోహన్ రెడ్డిని తిట్టమంటున్నారని… ఆ పని అస్సలు తాను చేయబోనని కాంగ్రెస్ పార్టీకి వారం రోజుల్లోగా రాజీనామా చేసి… మళ్లీ వైసీపీ కండువా కప్పుకున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. షర్మిల ను నమ్మించి… గొంతు కోసినట్లే ఆళ్ల రామకృష్ణ వ్యవహరించారు. అయితే ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న వైయస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారట. వైసీపీ తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిలో పోటీ చేస్తారు. అందుకే అతని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మంగళగిరి నియోజకవర్గం నుంచి షర్మిల పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారట.Ys Sharmila

దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో కొత్త అలజడి నెలకొంది. ఎందుకంటే టిడిపి మంగళగిరి అభ్యర్థిగా నారా లోకేష్ ఉన్నారు. ఇప్పటికి నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయి ఉన్నారు. ఇక ఇప్పుడు వైయస్ షర్మిల కూడా మంగళగిరి కి వస్తే… నారా లోకేష్ గెలుపు అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప నారా లోకేష్ గెలవడం చాలా కష్టమని హెచ్చరిస్తున్నారు. మరి షర్మిల నిజంగానే మంగళగిరిలో పోటీ చేస్తారా ? లేదా ? అనేది చూడాలి. ఒకవేళ మంగళగిరిలో షర్మిల పోటీ చేసి గెలిస్తే సీఎం జగన్ కు మంచి చేసినట్లే అవుతుంది. ఎందుకంటే తన ప్రత్యర్థి కొడుకు నారా లోకేష్ అక్కడ ఓడిపోతారు. ఏదైతేనేం.. తన మొదటి శత్రువు టిడిపి కనుక సీఎం జగన్ హ్యాపీగా ఉండే ఛాన్స్ ఉంది.Ys Sharmila

Join WhatsApp