Ys Sunitha Reddy Meets Ys Sharmila

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ షురూ అయింది. ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే చాన్స్ ఉంది. ఫిబ్రవరి మొదటి వారంలో లేదా రెండవ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న అధికార వైసిపి అలాగే ప్రతిపక్ష పార్టీలు అన్ని ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీ సిద్ధం పేరుతో ఎన్నికలలోకి దూసుకుపోతోంది.

YS Sunitha Reddy Meets YS Sharmila

అటు జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు పొత్తు కుదుర్చుకొని ముందుకు వెళుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వైఎస్ షర్మిల నియామకం అయి… దుమ్ము రేపుతున్నారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ.. వైసీపీ మరియు తెలుగుదేశం పార్టీలపై విమర్శలు చేస్తున్నారు షర్మిల. అంతేకాకుండా తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు అందరిని షర్మిల కలుస్తున్నారు.

Also Read: TDP: జనసేనకు 25-30 సీట్లే ఇచ్చి..పవన్‌ గొంతు నొక్కుతున్న బాబు ?

ఇక తాజాగా వైయస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతతో వైయస్ షర్మిల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పించారు. అయితే వీరిద్దరి సమావేశం నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వస్తోంది. సునీత కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని… అంతేకాకుండా కడప ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలుస్తోంది. గతంలో కడప ఎమ్మెల్యేగా వైసిపి పార్టీని గెలిచింది.

అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలంటే… సునీతను కడప ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని భావిస్తున్నారట. వైయస్ వివేక కేసు నేపథ్యంలో సునీత పోరాటం చేస్తూనే ఉన్నారు. వైయస్ కేసు వెనక వైసీపీ నేతలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. అందుకే సునీతకు న్యాయం జరగాలంటే… కడప ఎమ్మెల్యేగా ఆమెను గెలిపించాలని షర్మిల భావిస్తున్నారట. అందుకే తాజాగా సునీతతో షర్మిల సమావేశమైనట్లు తెలుస్తోంది. మరి దీనికి సునీత ఒప్పుకుంటుందా ? లేదా ? చూడాలి. (YS Sharmila)

Join WhatsApp