YS Vivekananda Reddy Exclusive Video with His Second Wife

YS Vivekananda Reddy: నెలరోజులు కూడా పార్లమెంట్ ఎన్నికలకు లేకపోవడంతో… ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ఈసారి ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తో పాటు పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. మే 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఏపీలో ఉన్న… అన్ని పార్టీలు ఒకటయ్యాయి. జనసేన, తెలుగుదేశం పార్టీ అలాగే బిజెపి పార్టీ ఏకమయ్యాయి. YS Vivekananda Reddy

YS Vivekananda Reddy Exclusive Video with His Second Wife

కానీ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సింహంలో సింగిల్ గా వస్తున్నారు. అందరినీ ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో మరోసారి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఘటన తెరపైకి వచ్చింది. వైయస్ వివేకానంద సంఘటన 2019లో జరిగిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ కేసులో చాలామంది అరెస్ట్ అయ్యారు. వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. కానీ అసలు నిందితులు మాత్రం ఇంకా అరెస్టు కాలేదు. YS Vivekananda Reddy

Also Read: Times Now Survey: జగన్‌, కేసీఆర్‌ దూకుడుకు బ్రేకులు లేవు..సర్వే ఫలితాలు ఇవే !

అయితే నెల రోజుల్లో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో… వైయస్ వివేకానంద రెడ్డి సరదాగా ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. తన రెండవ భార్య, కొడుకుతో ఎంజాయ్ చేశాడు వైఎస్ వివేకానంద. వాస్తవానికి శామీమ్ అనే ముస్లిం అమ్మాయిని వైయస్ వివేకానంద రెడ్డి 2010 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారట. ఈ విషయాన్ని పోలీసులకు విచారణలో భాగంగా శామీమ్ వెల్లడించారు. YS Vivekananda Reddy

2015 సంవత్సరంలో వైఎస్ వివేకానంద రెడ్డికి తనకు ఒక కొడుకు కూడా పుట్టాడని ఆమె వెల్లడించారు. అయితే రెండవ వివాహం కారణంగానే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందని పోలీసులు మొదట నిర్ధారించారు. ఆ దిశగా పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైయస్ వివేకానంద రెడ్డి మరియు అతని రెండవ భార్యతో ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో.. ఇప్పుడు ఏం చెప్తావ్ వైఎస్ సునితమ్మ అంటూ వైసిపి ఫైర్ అవుతోంది. మరి ఈ వీడియోపై వైయస్ సునీత ఎలా స్పందిస్తుందో చూడాలి.YS Vivekananda Reddy

Join WhatsApp