YSR or NTR Families are AP's Only Choices

AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగానే ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో అక్కడ ఎక్కువగా కాంగ్రెస్ అధికారంలో ఉండేది. అయితే ప్రత్యేక తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సీమాంధ్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం ఏపీలో రెండు లోకల్ పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా… 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది.

YSR or NTR Families are AP’s Only Choices

ఇక మరో రెండు నెలల్లో ఏపీలో మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏపీ రాజకీయాలలో సరికొత్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఏపీలో నాలుగు ప్రధాన పార్టీలు ఉన్నాయి. అందులో తెలుగుదేశం పార్టీ మరియు వైసీపీ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా అభివృద్ధి చెందాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి పార్టీలు జాతీయ పార్టీలుగా ఏపీలో మనుగాడ కొనసాగిస్తున్నాయి.

Also Read: Congress: తెలంగాణ ప్రజలు కరెంట్‌ బిల్లు కట్టాలా? వద్దా ?

అయితే తెలుగుదేశం పార్టీ అధినేతగా ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు. వాసవానికి తెలుగుదేశం పార్టీని పెట్టింది… నందమూరి తారకరామారావు. అయితే ఆయన మరణించిన తర్వాత ఎన్టీఆర్ అల్లుడైన చంద్రబాబు నాయుడుకు పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికీ ఎన్టీఆర్ అల్లుడు అయినా చంద్రబాబు నాయుడు చేతిలోనే తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఉన్నాయి. అటు బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నందమూరి తారక రామారావు కూతురు దగ్గుబాటి పురంధరేశ్వరి కొనసాగుతున్నారు.

ఇక వైసిపి పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పేరుతో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టారు. వైయస్సార్ కుమారుడిగా వైసీపీ పార్టీని చాలా విజయవంతంగా కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వైయస్ షర్మిల నియామకం. వైయస్ షర్మిల కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు అన్న సంగతి తెలిసిందే. అంటే ఏపీ రాజకీయాలలో ఎన్టీఆర్ మరియు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు అన్ని పార్టీల బాధ్యతలను కొనసాగిస్తున్నారు. ఏ ఇతర వర్గాలకు కూడా ఈ అవకాశం రాలేదు. (AP)

Join WhatsApp