Samantha: సమంతకు ఆ హీరో పై మోజు తగ్గలేదా.. ఎందుకు సమంత పై ఈ కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సమంత చేసిన తప్పేంటి.. ఆమెపై ఈ నెగటివ్ కామెంట్లు రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందా.. సెలబ్రేటిలకు సంబంధించిన ఏ విషయంలో నైనా తొందరగా స్పందిస్తూ ఉంటుంది.
Samantha Crush on star Hero
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా రాంచరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి రా మచ్చా మచ్చా రా అనే సాంగ్ కి సంబంధించి సోషల్ మీడియా ద్వారా తనదైన శైలిలో స్పందించింది. రామ్ చరణ్ సాంగ్ కి సంబంధించి సమంత పెట్టిన పోస్ట్ ఏంటంటే.. అన్ మ్యాచబుల్.. అంటూ పోస్ట్ షేర్ చేసింది.(Samantha)
Also Read: Devara: బయటపడ్డ దేవర బాగోతం.. పైడ్ మాఫియా.. వీక్ డేస్ లో నో బుకింగ్స్!!
అయితే ఈ పోస్ట్ పెట్టడానికి కారణం రామ్ చరణ్ స్టైల్ ఎవరు మ్యాచ్ చేయలేరు అని దాని అర్థం. ఇక ఆ పోస్టు తర్వాత మళ్ళీ రామ్ చరణ్ రా మచ్చా మచ్చా రా అనే సాంగ్ లో వేసుకున్న ఫార్మల్ ప్యాంటు షర్ట్ కి సంబంధించి పోస్ట్ పెడుతూ అలాంటి ప్యాంట్,షర్టు వేసుకొని ఎవరైనా ఇలాంటి డ్యాన్స్ చేస్తారా.. ఆ రేంజ్ లో డ్యాన్స్ చేయడం అనేది ఎవరికి సాధ్యం కాని పని..అందుకే ఈ పోస్ట్ పెట్టాను అంటూ ఫైర్ ఎమోజీలను పెట్టింది.
దీంతో సమంత పెట్టిన పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో సమంతకు రామ్ చరణ్ పై ఇంకా ప్రేమ తగ్గనట్టుంది.. అందుకే ఆయన సినిమాపై స్పందించింది అంటూ నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు కొంతమంది ఆకతాయిలు.. కానీ సమంత మాత్రం తనతో నటించిన ఏ హీరో సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది.(Samantha)