Samantha: సమంత నాగచైతన్య విడిపోయినప్పటికీ కూడా వీరి గురించి ఇప్పటికి మీడియాలో రోజుకొక వార్త వైరల్ అవుతుంది అంటే అతిశయోక్తి కాదు.ఎందుకంటే వీరి గురించి ఏ చిన్న విషయం అయినా సరే టక్కున సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజాగా సమంత ఓ సందర్భంలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ సందర్భంలో సమంత నాది కూడా అచ్చం సావిత్రి జీవితం లాగే అయ్యేది కానీ నేను తప్పించుకున్నాను అంటూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Samantha: My life would have been like Savitri but I escaped
మరి ఇంతకీ సమంత అలా ఎందుకు మాట్లాడింది అనేది ఇప్పుడు చూద్దాం.. మహానటి సావిత్రి అంటే తెలియని వారు ఉండరు.మహానటి సినిమా ద్వారా ఈమె ఇప్పటి జనరేషన్ కి కూడా తెలిసి వచ్చింది. అయితే సావిత్రి జీవితం లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి.ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయ్యి ఇండస్ట్రీని ఏలింది.(Samantha)
Also Read: Vijay devarakonda: విజయ్ దేవరకొండ పిక్ రిలీజ్ చేసిన కల్కి మూవీ మేకర్స్.. ట్వీట్ వైరల్..!
ఆ తర్వాత అష్టైశ్వర్యాలను సంపాదించుకొని చివరికి అయిన వాళ్ళ చేతిలో మోసపోయి ఉన్న ఆస్తి మొత్తం పోగొట్టుకొని ఎవరు లేని అనాధలా చివరికి మద్యపానం వ్యసనంగా మార్చుకొని ఆరోగ్యం పాడు చేసుకుని చివరి క్షణాల్లో దుర్భర స్థితిలో మరణించింది. అయితే అచ్చం సావిత్రి లాగే తన జీవితం కూడా అయ్యేది అంటూ సమంత ఓ సందర్భంలో మాట్లాడుతూ నాకు సావిత్రి గారి గురించి అంతగా తెలియదు.కానీ ఆమె గురించి సినిమాలు చూశాక తెలుసుకున్నా.. నా లైఫ్ కూడా సావిత్రి గారి లాగే అయ్యేదని తెలుసుకున్నాను.
సావిత్రి గారి లాగే నేను కూడా ప్రేమ విషయంలో ఓసారి మోసపోయాను.కానీ నా అదృష్టం కొద్ది నేను అందులో నుండి తొందరగానే తప్పించుకోగలిగాను. లేకపోతే నా జీవితం అలాగే అయ్యేది అంటూ సంచలన కామెంట్స్ చేసింది.అయితే సమంత అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవ్వడంతో ఈమె నాగచైతన్యని ఉద్దేశించి మాట్లాడిందా లేక ఆమె మొదట్లో ప్రేమించిన సిద్ధార్థ్ ని ఉద్దేశించి మాట్లాడిందా అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Samantha)