BCCI likely to release Upcoming IPL schedule in two phases

IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ పై తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నడు లేనివిధంగా ఐపీఎల్ 2024 టోర్నమెంట్ పై నీలి నీడలు అలుముకున్నాయి. అసలు ఈ ఏడాది ఐపీఎల్ 2024 టోర్నమెంట్ జరుగుతుందా ? లేదా ? అనే సందేహం అందరిలోనూ ఉంది. దీనికి ముఖ్య కారణం పార్లమెంట్ ఎన్నికలు మన ఇండియాలో జరుగుతుండటం. ఈసారి లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి.

BCCI likely to Release Upcoming IPL Schedule in Two Phases

సరిగ్గా ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ప్రారంభం అయ్యే సమయంలోనే… లోక్సభ ఎన్నికలు ప్రారంభమవుతాయి. వాస్తవానికి మార్చి 20వ తేదీ నుంచి ఐపీఎల్ 2024 టోర్నమెంటు ప్రారంభం కావాల్సి ఉంది. మే 30వ తేదీ లోపు ఫినిష్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఈ మధ్యలో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయితే… మన ఇండియాలో ఐపీఎల్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా కష్టమవుతుంది.

Also Read: Shoaib Malik: మూడో పెళ్లి ఎఫెక్ట్.. కుటుంబాన్ని వదిలేసి దుబాయ్ పారిపోయిన మాలిక్ ?

అటు పోలీసులు కూడా తాము పూర్తిస్థాయిలో భద్రత ఇవ్వలేమని ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులకు తేల్చి చెప్పారు. దీంతో ఐపీఎల్ 2024 టోర్నమెంట్ విదేశాలలో అంటే దుబాయిలో నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. కానీ తాజాగా అదేంలేదని అధికారులు వెల్లడించారు. అలా చేస్తే ఐపిఎల్ వల్ల పెద్దగా లాభం ఉండదని నిర్వాహకులు అనుకుంటున్నారట. అయితే ఇప్పుడు మరో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది.

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ను రెండు దశల్లో నిర్వహించాలని… అనుకుంటున్నారట. గ్రూప్ స్టేజ్ మ్యాచులు ప్రారంభమయ్యే సమయానికి లోక్సభ ఎన్నికల హడావిడి ఉంటుంది. కాబట్టి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లలో 50% మ్యాచ్లను విదేశాలలో నిర్వహించాలని అనుకుంటున్నారట. ఇక ఇండియాలో ఎన్నికలు అయిపోయిన తర్వాత… కీలక మ్యాచ్ లను ఇక్కడ నిర్వహించాలని డిసైడ్ అయ్యారట అధికారులు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. (IPL 2024)

Join WhatsApp