New rule in IPL for SRH blow Bad news for batters

Ipl 2024: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 40 మ్యాచ్ల వరకు పూర్తయ్యాయి. మరో నెల రోజుల వరకు ఈ టోర్నీ కూడా ముగియనుంది. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో అలాగే వచ్చే ఐపీఎల్ లో కీలక మార్పులు చేసే విధంగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతుంది. స్టేడియం యొక్క సిక్స్ గేట్, లేదా ఫోర్ గేట్ దూరాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తోందట బీసీసీఐ పాలకమండలి. Ipl 2024

because of SRH new rule in ipl 2024

దీనంతటికీ కారణం హైదరాబాద్ జట్టు అని సమాచారం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ జట్టు బ్యాటర్లు చాలా భయంకరంగా బ్యాటింగ్ చేస్తున్నారు. బౌలర్లకు ఏమాత్రం చాన్సు ఇవ్వకుండా ఓవర్కు 20 పరుగుల చొప్పున కొట్టేస్తున్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 300 కాదు 400 కూడా కొడతారని అందరూ అనుకున్నారు. పవర్ ప్లే అయిన ఆరు ఓవర్లలోనే 126 పరుగులు చేశారు హైదరాబాద్ బ్యాటర్లు. Ipl 2024

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ ఔటా? నాటౌటా? క్రికెట్ రూల్స్ ఏం చెబుతున్నాయి?

అంతేకాదు ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ స్కోర్ కొట్టిన జట్టుగా కూడా హైదరాబాద్ రికార్డు సృష్టించింది. మొన్న జరిగిన మ్యాచ్లో 287 పరుగుల టార్గెట్ ఇచ్చింది హైదరాబాద్. అలాగే 277 పరుగులు మరొకసారి చేసింది. మొన్న ఢిల్లీ పైన 266 పరుగులు చేసింది హైదరాబాద్ జట్టు. అయితే హైదరాబాద్ జట్టు అవలీలగా పరుగులు చేస్తున్న నేపథ్యంలో… కొంతమంది క్రీడా విశ్లేషకులు బౌండరీ గేట్ దూరం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారట. బౌండరీ గేట్ దూరంగా పెడితే బౌలర్లకు చాలా ఈజీ అవుతుందని.. వారికి కాస్త రిలీఫ్ ఉంటుందని చెబుతున్నారట. Ipl 2024

ఈ లిస్టులో సునీల్ గవాస్కర్ కూడా ఉన్నారు. బౌండరీ గేటు దూరంగా పెడితే… బౌలర్లపై ప్రెషర్ తగ్గిపోతుందని ఆయన చెబుతున్నారు. వెంటనే దీనిపై బిసిసిఐ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరాడట. దీంతో బీసీసీఐ పాలకమండలికి కూడా ఆ దిశగా అడుగులు వేస్తోందట. ఈ సీజన్ కాకుండా వచ్చే సీజన్ నుంచి అయినా దీనిపై నిర్ణయం తీసుకోనుందని సమాచారం. అంతేకాకుండా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా తొలగించే యోచనలో బీసీసీఐ పాలకమండలి ఉన్నట్లు సమాచారం అందుతుంది.Ipl 2024

Join WhatsApp