Hardik Pandya: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐపిఎల్ 2024 టోర్నమెంట్ హడావిడి కొనసాగుతుందట సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మాత్రమే చూస్తున్నారు. ఎందుకంటే ఐపీఎల్ టోర్నమెంట్ కు అంత పాపులారిటీ ఉంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు వరుస షాక్ లు తగులుతున్నాయి. గుజరాత్ నుంచి ముంబై జట్టుకు వచ్చి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు పాండ్యా. Hardik Pandya

Big shock to Hardik Pandya BCCI new conditions

అయితే కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్న ముంబై టీం ఈసారి దారుణంగా ఆట తీరును కనబరుస్తోంది. కేవలం రెండు మ్యాచ్లే గెలిచిన ముంబై ఇండియన్స్… ఈసారి ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు లేకుండా చేసుకుంటుంది. ఇకనుంచి వరుసగా మ్యాచులు గెలిచినా కూడా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు లేవని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది. Hardik Pandya

Also Read: Rohit Sharma: రోహిత్ సెల్ఫిష్..దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న ఫాన్స్ !

టీమిండియాలోకి రావాలంటే హార్దిక్ పాండ్యాకు కొన్ని కండిషన్లు పెట్టింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.రాబోయే టి20 ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కాలంటే హార్దిక్ పాండ్యా రెగ్యులర్గా బౌలింగ్ చేయాల్సిందేనని బీసీసీఐ పాలకమండలి స్పష్టం చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ ద్రవిడ్, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ ఇదే విషయంపై చర్చించారట. Hardik Pandya

హార్దిక్ పాండ్యా రెగ్యులర్గా బౌలింగ్ చేసి వికెట్లు తీయగలిగితేనే… టి20 ప్రపంచ కప్ లోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లేకపోతే హార్దిక్ పాండ్యా స్థానంలో శివం దూబేను తీసుకోవాలని బీసీసీఐ అధికారులు అనుకుంటున్నారట. కాగా ఈ సీజన్ లో హార్దిక్ పాండ్యా సరిగా బౌలింగ్ చేయకపోవడమే కాకుండా బ్యాటింగ్ కూడా సరిగా చేయడం లేదు. అందుకే హార్దిక్ పాండ్యాకు ఈసారి టి20 ప్రపంచ కప్ అవకాశాలు లేనట్లేనని స్పష్టమవుతుంది.Hardik Pandya

Join WhatsApp