Fan Touches Rohit Sharma's Feet in 1st Test Hyderabad

Rohit Sharma: హైదరాబాద్‌ లోని ఉప్పల్ స్టేడియంలో నిన్న అనుకోని ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌, ఇండియా మధ్య మొదటి టెస్ట్‌ మ్యాచ్ జరుగుతుండగా ఓ అభిమాని గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. ఒక ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మ దగ్గరకు పరిగెత్తాడు. హిట్ మ్యాన్ కాళ్లు మొక్కాడు. రోహిత్ వద్దంటున్నా అభిమాని వినిపించుకోలేదు. అయితే సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన అభిమానిని గ్రౌండ్ బయటకు తీసుకెళ్లారు. మైదానంలోకి అభిమాని దూసుకొచ్చిన ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది.

Fan Touches Rohit Sharma‘s Feet in 1st Test Hyderabad

అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే…. రోహిత్ కాళ్లు మొక్కింది విరాట్ కోహ్లీ అభిమాని అని చర్చ జరుగుతుంది. ఎందుకంటే గ్రౌండ్ లోకి దూసుకెళ్లిన అభిమాని టీమిండియా జెర్సీని వేసుకున్నాడు. ఆ జెర్సీపై విరాట్ 18 నంబర్ ఉంది. 18వ నంబర్ జెర్సీని విరాట్ కోహ్లీ వేసుకుంటాడు. దీంతో గ్రౌండ్ లోకి దూసుకెళ్లింది విరాట్ అభిమానేనని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఇంతకీ కోహ్లీ అభిమాని రోహిత్ కాళ్లు ఎందుకు మొక్కినట్టు అని సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. నిజానికి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కోహ్లీ, రోహిత్ అభిమానుల మధ్య కామెంట్స్ వార్ నడిచిన సందర్భాలు ఉన్నాయి.

Also Read: Shubman Gill: ఆ పనులు చేసి..కెరీర్‌ నాశనం చేసుకున్న గిల్‌ ?

అయితే కోహ్లీ, రోహిత్ మధ్య మాత్రం మంచి బాండింగ్ ఉంది. ఇద్దరు టీమిండియా కోసం కష్టపడుతున్నారు. భారత్ విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒకరు కెప్టెన్ గా, మరొకరు లీడర్ గా జట్టును నడిపిస్తున్నారు. విరాట్ కెప్టెన్ గా ఉన్నప్పుడు రోహిత్ కు సపోర్టుగా నిలిచారు. ఫామ్ లేక ఇబ్బందిపడినప్పుడు ఒత్తిడి లేకుండా చూశాడు. విరాట్ విషయంలోను అదే జరిగింది. దాదాపు మూడు సంవత్సరాల పాటు కోహ్లీ బిగ్ స్కోర్లు లేక ఇబ్బందిపడ్డాడు. అలాంటి సమయంలో విరాట్ కు రోహిత్ మద్దతు తెలిపాడు. గ్రౌండ్ లో ఇద్దరిని చూసినా వారి మధ్య బాండింగ్ అదుర్స్ అనేలా ఉంటుంది. ఒకరి సక్సెస్ ను మరొకరు ఎంజాయ్ చేస్తున్నారు. గ్రౌండ్ లో ఇద్దరు హుషారుగా కనిపిస్తున్నారు. సవాళ్లను స్వీకరిస్తున్నారు. యువ ప్లేయర్లలో స్ఫూర్తిని నింపుతున్నారు. (Rohit Sharma)

వన్డే వరల్డ్ కప్ లోను కోహ్లీ, రోహిత్ అద్భుతంగా ఆడారు. ఫైనల్ లో భారత్ ఓడినా….ఓవరాల్ గా స్టార్ ప్లేయర్ల ఆట మాత్రం ఆకట్టుకుంది. టీమ్ ఇండియాకు కోహ్లీ, రోహిత్ పిల్లర్స్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. తాజాగా ఉప్పల్ లో రోహిత్ కాళ్ళను విరాట్ అభిమాని మొక్కిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. టీమిండియాకు ఇద్దరు కీలక ఆటగాళ్లే అయినప్పుడు కోహ్లీ ఫ్యాన్ రోహిత్ పైన అభిమానం చూపించడం తప్పేముందనే వాదన వినిపిస్తుంది. మొత్తానికి ఉప్పల్ లో కనిపించిన సీన్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే..రోహిత్‌ కాళ్లు పట్టుకున్న ఆ అభిమానికి భారీగానే జరిమానా వేశారు అధికారులు.

Join WhatsApp