Good news for CSK.. Star player is coming

IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మరో రెండు రోజుల్లోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 22వ తేదీన ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది. మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్ 2024 మొదటి ఎడిషన్… ఏప్రిల్ 7వ తేదీ వరకు జరుగుతుంది. IPL 2024

Good news for CSK Star player is coming

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేవలం 15 మ్యాచ్లు మొదటి ఎడిషన్ లో నిర్వహిస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది. గాయం కారణంగా ఐపీఎల్ 2024 టోర్నమెంట్ కు దూరమవుతాడని అందరూ భావించిన బంగ్లాదేశ్ స్టార్ ఫేసర్ ముస్తాఫిజూర్ రహమాన్.. రీయంట్రి ఇవ్వబోతున్నాడు. IPL 2024

Also Read: Virat Kohli: RCBని వదిలి వేయనున్న విరాట్ కోహ్లీ.. షాక్ లో ఫ్యాన్స్ ?

గాయం కారణంగా ఐపిఎల్ 2024 టోర్నమెంటు ఆడబోడని అందరూ అనుకున్నారు. కానీ ముస్తాఫిజుర్ రహ్మాన్… చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తిరిగి రానున్నాడట. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఐపిఎల్ 2024 కోసం చెన్నై వెళ్తున్నాను అంటూ బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ వెల్లడించారు. IPL 2024

నా కొత్త అసైన్మెంట్ కోసం ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని వివరించారు. మీ అభిమానంతో పాటు ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ నాకు ఉండాలని వెల్లడించాడు రహమాన్. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం వచ్చింది. ఇది ఇలా ఉండగా పూర్తిస్థాయి షెడ్యూల్ మరి కొన్ని రోజుల్లోనే రిలీజ్ కానుంది. IPL 2024

Join WhatsApp