How Many Properties Sania Mirza Has

Sania Mirza: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు కుప్పలు తెప్పలుగా చక్కర్లు కొడుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఆమె తన భర్తతో విడాకులు తీసుకోవడమే. ఇక ఎవరైనా సరే సెలబ్రిటీస్ ఏదైనా ఒక విషయంలో వైరల్ అయితే ఖచ్చితంగా ఆ సెలబ్రిటీ గురించి ప్రతి ఒక్క విషయాన్ని నెటిజన్స్ వైరల్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా తన భర్తతో విడాకులు తీసుకొని విడిపోయిన సానియా మీర్జా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.

How Many Properties Sania Mirza Has

అదేంటంటే.. సానియా మీర్జా తన భర్త నుండి విడాకులు తీసుకున్న సమయంలో ఒక్క రూపాయి కూడా భరణం తీసుకోలేదని, ఎందుకంటే తనకి కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టే ఆమె రూపాయి కూడా భర్త నుండి ఆశించలేదని తెలుస్తోంది.మరి ఇంతకీ సానియా మీర్జా కి ఉన్న ఆస్తిపాస్తులు ఎన్నో తెలిస్తే మీరందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే సానియా మీర్జా ఆస్తులు విలువ ఏకంగా 210 కోట్లకు పైగానే అని సమాచారం. (Sania Mirza)

Also Read: Sania Mirza: భర్తకు విడాకులిచ్చిన సానియా భరణం కింద ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా..?

సానియా మీర్జా కేవలం టెన్నిస్ ఆడటం మాత్రమే కాకుండా కొన్ని వ్యాపార ప్రకటనల్లో కూడా చేస్తుంది. అలాగే కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది. అలా సానియా మీర్జా ఇప్పటికే హెర్బల్ లైఫ్, అడిడాస్ వంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే సానియా మీర్జా దగ్గర కోట్ల విలువ చేసే కార్ల కలెక్షన్లు కూడా ఉన్నాయట.ఎందుకంటే సానియా మీర్జాకి కార్లంటే చాలా ఇష్టం.

 Do you know how many properties Sania Mirza has

మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా కూడా ఎంత డబ్బైనా పెట్టి కొంటుందట. అలా ఇప్పటికే సానియా మీర్జా దగ్గర బిఎండబ్ల్యూ, రేంజ్ రోవర్,పోర్స్చే, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ XF వంటి దాదాపు 4 కోట్ల ఖరీదు చేసే కార్ల కలెక్షన్ ఉందట. అంతేకాకుండా ఈమెకు విలాసవంతమైన బంగ్లా తోపాటు పబ్బులు,రెస్టారెంట్లు కూడా ఉన్నాయట. 210 కోట్లతో పాటు సానియా మీర్జా నెలకు భారీగానే సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది.ఆమె నెలకు దాదాపు 10 నుండి 13 కోట్ల వరకు సంపాదిస్తుందట. (Sania Mirza)

Join WhatsApp