Hyderabad’s Uppal Stadium Decked up for India vs England Test Match

India vs England: ఉప్పల్ టెస్ట్ కు టీం ఇండియా సిద్ధమైంది. రేపటి నుంచి ప్రారంభం అయ్యే మ్యాచ్ కోసం వ్యూహాలు రచిస్తోంది టీమిండియా జట్టు. మంచి రికార్డు ఉన్న ఉప్పల్ లో గెలిచి ఐదు టెస్టుల సిరీస్ ను శుభారంభం చేయాలని చూస్తోంది రోహిత్ సేన. అయితే తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఉప్పల్ లో తొలి టెస్ట్.. ఆ తర్వాత ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో 2వ టెస్టు ప్రారంభంకానుంది. ఈ రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరంగా ఉండనున్నాడు.

Hyderabad’s Uppal Stadium Decked up for India vs England Test Match

వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండట్లేదు కోహ్లీ. ఇక కోహ్లీ స్థానంలో మరో ఆటగాడిని సెలక్షన్ కమిటీ త్వరలోనే ఎంపిక చేయనుంది. ఉప్పల్ లో కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇక్కడ టెస్టుల్లో 5 ఇన్నింగ్స్ లో 75.80 సగటుతో 379 పరుగులు చేశాడు. ఒక డబల్ సెంచరీ కూడా ఉంది. ఇంత మంచి రికార్డు ఉన్న కోహ్లీ దూరం అవడం టీమిండియాకు సమస్యేనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే.. రేపటి మ్యాచ్‌ పై రోహిత్‌ శర్మ తన గేమ్‌ ప్లాన్‌ ను కూడా వివరించారు. ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో రాణిస్తామని…అద్భుతమైన ప్రదర్శనతో సిరీస్ కైవసం చేసుకుంటామని వెల్లడించారు రోహిత్‌ శర్మ. రెండు మాసాలుగా మా ప్లేయర్లు అద్భుతంగా రాణిస్తున్నారని..ఇంగ్లాండ్ జట్టులో బలమైన ఆటగాళ్ళు ఉన్నారు.. తక్కువ అంచనా వేయలేమని చెప్పారు.

Also Read: T20: సూర్యకుమార్‌కు బంపర్ ఆఫర్..T20 కెప్టెన్‌ గా నియామకం

పక్కా వ్యూహంతో ఉప్పల్ మైదానంలోకి దిగుతామని… టెస్ట్ సిరీస్ లో అనేక మార్పులు సంతరించుకున్నాయని పేర్కొన్నారు. 20 ఏళ్ల టెస్ట్ మ్యాచ్ కు… ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లకు చాలా వ్యత్యాసం ఉందని స్పష్టం చేశారు. విరాట్ దూరం అవ్వడం లోటేనని… జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్లను పరిగణిస్తామన్నారు. సీనియర్లకు కూడా తలుపులు ముసుకు పోలేదని… మూడో స్పిన్నర్ గా అక్షర్, కుల్ దిప్ లలో ఎవరిని ఆడించాలన్నది తల నొప్పేనన్నారు. (India vs England)

Join WhatsApp