IPL 2024 May Move to Dubai During Elections

IPL 2024: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ కోసం ఎదురుచూస్తున్న క్రీడ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఐపీఎల్ 2024 నిర్వహణ చాలా కష్టం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. శనివారం మధ్యాహ్నం నుంచి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సార్వత్రిక ఎన్నికలను ఏడు దశలలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 16వ తేదీ న తొలి దశ పోలింగ్ జరుగుతుంది. IPL 2024

IPL 2024 May Move to Dubai During Elections

ఏప్రిల్ 26వ తేదీన రెండవ దశ, మే 7వ తేదీన మూడవ దశ, మే 13వ తేదీన 4వ దశ, మే 20వ తేదీన 5వ దశ, మే 25వ తేదీన ఆరవ దశ అలాగే జూన్ ఒకటో తేదీన చివరి దశ జరుగుతుంది. అంటే దాదాపు మూడు నెలల పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉంటుంది. ఎక్కడ కూడా ఎన్నికల కోడ్ ఎత్తివేసే ఛాన్స్ ఉండదు. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ 2024 టోర్నమెంట్ నిర్వహించడం అసాధ్యమని చెబుతున్నారు. IPL 2024

Also Read: IPL 2024: ఇంగ్లాండ్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడకుండా BCCI చర్యలు ?

కానీ ఇప్పటికే ఐపీఎల్ 2024 మొదటి దశ షెడ్యూల్ ను బిసిసిఐ పాలకమండలి రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు మ్యాచులు జరుగుతాయి. అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఈ మ్యాచ్లు కూడా జరిగే ఛాన్స్ లేదని చెబుతున్నారు క్రీడా విశేషకులు. దీనికి కారణం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడమే. ఎన్నికల కూడా అమలులోకి వస్తే… పదివేల రూపాయలను కూడా మనం ఎక్కడికి తీసుకు వెళ్లలేం. ఒకవేళ తీసుకువెళ్లిన ఎన్నికల కోడ్ కింద మనకు అనేక చిక్కులు వస్తాయి. IPL 2024

అలాంటిది ఐపీఎల్ 2024 టోర్నమెంట్ నేపథ్యంలో వేల డబ్బులు చేతులు మారుతాయి. మ్యాచ్ ఫిక్సింగ్, క్రికెట్ లావాదేవీలు, అలాగే క్రికెటర్ల భద్రత, స్టేడియం దగ్గర సెక్యూరిటీ ఇలా ఎన్నో తలనొప్పులు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బహిరంగ సభలు అలాగే మీటింగ్లకు పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాలి. ఇటు ఐపీఎల్ మ్యాచ్లకు కూడా ఇదే పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఐపిఎల్ వాయిదా వేసుకోవాలని ఇప్పటికే పోలీసులు బీసీసీఐకి చెప్పారట. దీంతో ఈసారి ఐపీఎల్ ఇండియాలో జరగడం కష్టమని చెబుతున్నారు. మార్చి 22వ తేదీన ప్రారంభం కావాల్సిన టోర్నీ కూడా దుబాయ్ లో చేసుకోవాలని చెబుతున్నారు. పూర్తిస్థాయిలో దుబాయిలో టోర్నీ నిర్వహించుకోవాలని సూచనలు చేస్తున్నారు క్రీడా విశ్లేషకులు.IPL 2024

Join WhatsApp