Key Reasons To Win India In Ind Vs Eng Match

Ind Vs Eng: టీమిండియా టెస్ట్ మ్యాచ్లలో దూసుకుపోతోంది. మొట్టమొదటి హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్లో ఓడిన టీమిండియా ఆ తర్వాత పుంజుకుంది. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య రాజ్ కోట వేదికగా…. మూడవ టెస్టు నిన్న పూర్తయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మూడో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఆఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.ఏకంగా 434 పరుగుల తేడాతో మూడవ టెస్టులో విజయం సాధించింది టీమిండియా.

Key Reasons To Win India In Ind Vs Eng Match

దీంతో చరిత్రలో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 445 పరుగులు చేసి టీమ్ ఇండియా ఆల్ అవుట్ అయింది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో… రోహిత్ శర్మ మరియు జడేజాలు సెంచరీ చేసి టీమ్ ఇండియాను ఆదుకున్నారు. అలాగే కొత్తగా జట్టులోకి వచ్చిన సర్ఫా రాజ్ కు హాఫ్ సెంచరీ చేసి టీమిండియాను ఆదుకున్నారు.అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టును 319 పరుగులకు టీమిండియా బౌలర్లు ఆల్ అవుట్ చేయగలిగారు.

Also Read: Ravichandran Ashwin: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌..అతడు వచ్చేశాడు

అయితే మొదటి ఇన్నింగ్స్ లో మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరచాడు. అటు జడేజా, బమ్ర, అశ్విన్ కూడా అద్భుతంగా బౌల్ చేశాడు. అయితే మధ్యంతరంగా అశ్విన్ మ్యాచ్ నుంచి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ టీమిండియా బౌలర్స్ రాణించారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 430 పరుగులు చేసింది. అనంతరం డిక్లేర్ ఇచ్చారు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేశాడు. అటు కొత్త ప్లేయర్ సర్ఫా రాజ్ మరోసారి హాఫ్ సెంచరీ చేసి టీమ్ ఇండియాకు మంచి పికప్ ఇచ్చాడు.

ఇక అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన… ఇంగ్లాండ్ జట్టు 122 పరుగులకే చాప చుట్టేసింది. రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా జడేజా ఐదు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇలా టీమిండియా… బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు రంగాలలో రాణించి అద్భుతంగా విజయం సాధించింది. ఆల్ రౌండర్ పాత్రలో రవీంద్ర జడేజా అద్భుతంగా రానించాడు. ఇటు మిడిల్ ఆర్డర్ కొత్త బ్యాట్స్మెన్ సర్ఫా రాజ్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా టీమిండియా మూడవ టెస్ట్ లో అవలీలగా గెలిచింది.

Join WhatsApp