MayanK Agarwal gives Health Update after Hospital admission

MayanK Agarwal: టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ కు ఊహించని పరిణామం ఎదురైంది. మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు లోనైయ్యాడు. విషం కలిపిన ద్రావణం తాగడంతో ఆసుపత్రి పాలయ్యాడు టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్. ఇక ఈ తరుణంలోనే..టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ కు అగర్తలాలోని ఓ హాస్పిటల్ లో మెరుగైన వైద్యం అందిస్తున్నారు వైద్యులు. ఇక నిన్ననే మయాంక్ హెల్త్ బులిటిన్ ని విడుదల చేశారు వైద్య బృందం. మంచినీరు అనుకోని హానికరమైన ద్రవం తాగడం వల్లే ఆసుపత్రి పాలైనట్లు నిర్ధారించారు వైద్యులు.MayanK Agarwal

MayanK Agarwal gives Health Update after Hospital admission

అయితే ఈ కర్ణాటక క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పడంతో…టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తాజాగా డిశ్చార్జ్‌ కూడా అయినట్లు సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా, టీమిండియా జట్టులో టెస్ట్ ఓపెనర్, బ్యాట్స్మెన్ గా పలు మ్యాచ్లు ఆడాడు. మయాంక్ అగర్వాల్ అగర్తలా నుంచి ఢిల్లీకి బయలుదేరిన సమయంలో ఈ స్టార్ క్రికెటర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని నివేదికలు చెబుతున్నాయి. మొన్న మంగళవారం సాయంత్రం మయాంక్ అగర్వాల్ ఢిల్లీ నుంచి అగర్తల వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కాడు. ఫ్లైట్ లో తాను కూర్చున్న సీటు ముందు పౌచ్ లో ఉన్న ద్రవాన్ని తాగి తీవ్ర స్వస్థతకు గురయ్యాడని తెలుస్తోంది.

Also Read: Virat Kohli: టీమిండియాకు బిగ్ షాక్.. మిగతా టెస్టుల నుంచి కోహ్లీ అవుట్ !

గొంతులో వాపు, బొబ్బలు రావడంతో వెంటనే అతన్ని విమానం నుంచి దించి స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించారు. కాగా హాస్పిటల్ నుంచి తన మేనేజర్ సహాయంతో మయాంక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టామని పోలీసులు తెలిపారు. అయితే..ఎవరో కావాలనే టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ను టార్గెట్‌ చేశారని.. అతని తాగే ద్రావణంలో విషం కలిపారని సమాచారం అందుతోంది. దీని వెనుక ఓ క్రికెటర్‌ ఉన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

కాగా, మయాంక అగర్వాల్ రంజి ట్రోఫీలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. త్రిపుర వర్సెస్ కర్ణాటక మధ్య అగర్తలలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ అనంతరం సౌరాష్ట్రతో తదుపరి మ్యాచ్ కోసం రాజ్కోట్ వెళ్లాల్సి ఉంది. దీంతో మయాంక్ అగర్వాల్ జర్నీలో భాగంగా అగర్తలా నుంచి ఢిల్లీ వెళ్లే విమానాన్ని ఎక్కాడు. మయాంక్ తాగింది క్లీనింగ్ రసాయనం అయ్యుంటుందని దానిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. అస్వస్థతకు గురైన నేపథ్యంలో మయాంక్ రేపు సూరత్ లో రైల్వేస్ తో జరిగే మ్యాచ్ కు దూరమయ్యారు. అతడి స్థానంలో మనీష్ పాండే ఆడనున్నాడు.MayanK Agarwal

Join WhatsApp