Mohammed Shami out from ipl 2024

Mohammed Shami: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా ఐపిఎల్ 2024 టోర్నమెంట్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. మార్చి 20 నుంచి… ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ప్రారంభం అయ్యే.. ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.Mohammed Shami 

Mohammed Shami out from ipl 2024

ఆ జట్టు స్టార్ బౌలర్ అయిన మహమ్మద్ షమీ… టోర్నమెంట్ మొత్తం నుంచి దూరం కానున్నాడు. చీలమండ గాయం… కారణంగా ఈ సీజన్ నుంచి మహమ్మద్ షమీ తప్పుకున్నారు. ఇప్పటికే గాయం కారణంగా మహమ్మద్ షమీ ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి కూడా సమీ దూరం కానున్నాడు.Mohammed Shami

వాస్తవానికి టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ వన్డే వరల్డ్ కప్ 2023 ముందు నుంచే ఎడమకాలి చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. వరల్డ్ కప్ మధ్యలో అతడిని తుది జట్టులోకి తీసుకోగా.. గాయం వేధిస్తున్న అద్భుతంగా రాణించాడు. ఆ మెగా టోర్నీ పూర్తయ్యాక… గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ఇతర సిరీస్ లకు కూడా దూరం అయ్యాడు షమీ.Mohammed Shami

Also Read: Skin: ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయ్యి వారం రోజుల్లో మిల మిల మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోండి..!

అతని గాయం రోజురోజుకు ఎక్కువగా అవుతుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మద్ షమీకి మంచి చికిత్స అందించేందుకు విదేశాలకు పంపిస్తోంది బీసీసీఐ. ఈ కారణంగా ఐపీఎల్ టోర్నమెంట్ మొత్తానికి దూరం అవుతున్నాడు శమీ. అయితే మహమ్మద్ షమీ టోర్నమెంట్ కు దూరం కావడంతో గుజరాత్ జట్టుకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. దీనికి కారణం ఇప్పటికే ఇద్దరు ప్లేయర్లు గుజరాత్ జట్టుకు దూరంగా ఉండటం. Mohammed Shami

గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఇటీవల ముంబై జట్టు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే టోర్నమెంట్ నుంచి పాండ్యా ముంబై జట్టుకు ఆడతాడు. అటు గుజరాత్ జట్టు స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా ఆపరేషన్ కారణంగా వచ్చే సీజన్ ఆడకపోవచ్చు. ఈ తరుణంలో ముగ్గురు స్టార్లు గుజరాతి జట్టుకు దూరం కానున్నారు. ఈ ముగ్గురు లేకుండా గుజరాత్ జట్టు రాణిస్తుందా లేదా అనేది చూడాలి.Mohammed Shami

Join WhatsApp