MS Dhoni out in the middle of IPL 2024 season

Ms Dhoni: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వర్సెస్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇవాళ సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది. Ms Dhoni

MS Dhoni out in the middle of IPL 2024 season

అయితే ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్యాన్స్ కు ఊహించని షాక్ తగిలింది. నిన్న సాయంత్రం మహేంద్ర సింగ్ ధోని సంచలన ప్రకటన చేశారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్యాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఐదు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ను ఛాంపియన్గా నిలిపిన మహేంద్ర సింగ్ ధోని సంచలన ప్రకటన చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్సీ కి రాజీనామా చేశారు మహేంద్ర సింగ్ ధోని. Ms Dhoni

Also Read: Ipl 2024: బెంగళూరులో నీటి సమస్య… RCB మ్యాచ్ లు అన్నీ రద్దు ?

అప్పటివరకు కెప్టెన్ గా కొనసాగిన మహేంద్ర సింగ్ ధోని.. గురువారం సాయంత్రం ఈ ప్రకటన చేశారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కూడా గందరగోళ పరిస్థితికి వెళ్లిపోయింది. అంతలోనే రుతురాజు గైక్వార్డును కెప్టెన్ గా అనౌన్స్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అనంతరం అన్ని జట్ల కెప్టెన్ల ఫోటో సెర్మని కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ పాల్గొన్నారు. Ms Dhoni

అయితే మహేంద్ర సింగ్ ధోని ఆరోగ్యం అస్సలు సహకరించడం లేదట. గత కొన్ని రోజులుగా ఫిట్నెస్ లేని సమస్యతో బాధపడుతున్నారట మహేంద్ర సింగ్ ధోని. అందుకే ఈసారి కెప్టెన్సీ ని సడన్గా వదిలేసుకున్నాడట. ఒకవేళ ఫిట్గా లేకపోతే మధ్యలోనే వెళ్లిపోవాలని అనుకుంటున్నాడట. చాన్స్ కుదిరితే ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా రోల్ ప్లే చేయాలని అనుకుంటున్నాడట ధోని. ఒకవేళ ఫిట్ గా ఉంటే కీపర్ గా కొనసాగుతాడట. అందుకే మధ్యలోనే కేపిఎన్సిని వదిలేసుకున్నాడు ధోని.Ms Dhoni

Join WhatsApp