Shoaib Malik Denies Match Fixing Allegations

Shoaib Malik: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. సానియా మీర్జాతో విడాకులు… ఆ తర్వాత సనాజావిద్ తో పెళ్లి… ఇప్పుడు ఫిక్సింగ్ ఆరోపణలు..మొత్తంగా షోయబ్ మాలిక్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాడు. కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టగానే టీ20లో 13 వేలకుపైగా పరుగులు సాధించిన ప్లేయర్ గా రికార్డులకు ఎక్కాడు షోయబ్. అయితే అంతలోనే ఫిక్సింగ్ ఆరోపణలు గుప్పుమన్నాయి.

Shoaib Malik Denies Match Fixing Allegations

ఇంతకీ ఆ ఆరోపణలు ఏంటంటే…. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఒకే ఓవర్ లో మూడు నో బాల్స్ వేసినట్టుగా సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై ఫార్చ్యూన్ బరిషల్‌ జట్టు మాలిక్ ను తప్పించినట్లు వార్తలు వచ్చాయి. కథనాలు వచ్చాయి. దీనిపై ఆర్గనైజర్ ల నుంచి అఫీషియల్ గా ఎలాంటి స్పందన లేదు. అయితే ఒకే ఓవర్ లో మూడు నోబెల్స్ వేయడం ఏంటని ఫార్చ్యూన్ బరిషల్‌ యాజమాన్యం గుర్రుగా ఉందని చర్చ జరుగుతోంది. ఫ్రాంచైజీ ఓనర్ కూడా ఫిక్సింగ్ వార్తలను ఖరారు చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Also Read: Rohit Sharma: రోహిత్ కాళ్ళు మొక్కిన కోహ్లీ అభిమానికి భారీ జరిమానా ?

సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై చివరకు మాలిక్ స్పందించాడు. తనపై వస్తున్న కథనాలు అన్నీ కట్టుకథలేనన్నాడు. ఇదే అంశంపై తన జట్టు కెప్టెన్ తో మాట్లాడాలని అన్నారు. ఏ నిర్ణయమైనా కలిసే తీసుకుంటామన్నాడు. ముందే డిసైడ్ అయిన కార్యక్రమాల కోసమే దుబాయ్ కు వెళ్లానని చెప్పాడు. తర్వాత మ్యాచ్ లో జట్టు విక్టరీ కొట్టాలని అన్నాడు. అవసరమైనప్పుడు జట్టుతోనే ఉంటానన్నాడు. సోషల్ మీడియాలో ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు. మరోవైపు షోయబ్ మాలిక్ మూడో పెళ్లి తర్వాత సానియా మీర్జా తొలిసారి పోస్ట్ పెట్టింది.

షోయబ్ గురించి సానియా ఏమి ప్రస్తావించలేదు. కానీ తాను చెప్పాలనుకున్నది ఒక్క ముక్కలో చెప్పేసింది. ఒక ఫోటోను పోస్ట్ చేసింది. అందులో సానియా అద్దం ముందు నిల్చోనే ఉంది. రిఫ్లెక్ట్ అని ఫోటోకు క్యాప్షన్ జత చేసింది. ఈ పోస్టులో చాలా విషయం దాగి ఉందని సానియా అభిమానులు చర్చించుకుంటున్నారు. షోయబ్ మాలిక్ కు కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు. సానియా మీర్జాకు పాక్ క్రికెటర్ ద్రోహం చేశాడని కొందరు ఫైర్ అవుతున్నారు. భారత టెన్నిస్ స్టార్ కు మద్దతుగా నిలుస్తున్నారు. (Shoaib Malik)

Join WhatsApp