Should RCB's IPL Matches In Bengaluru Be Cancelled Over Water Crisis

Ipl 2024: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. మొదటి ఎడిషన్ లో భాగంగా ఏకంగా 15 మ్యాచులు జరగనున్నాయి. ఇక రేపు మొట్టమొదట చెన్నై సూపర్ కింగ్స్ మరియు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు మధ్య మ్యాచ్ ఉంటుంది. సాయంత్రం ఎనిమిది గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. Ipl 2024

Should RCB’s IPL Matches In Bengaluru Be Cancelled Over Water Crisis

ఈ మేరకు ఐపీఎల్ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ మరియు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు అన్నీ ఇప్పటికే విక్రయాలు జరుపుకున్నాయి. ఇలాంటి నేపథ్యంలో బెంగళూరు ఫ్యాన్స్ కు ఊహించని శాక్ తగిలేలా కనిపిస్తోంది. దీనికి కారణం బెంగళూరు పట్టణంలో నీటి సమస్య విలయతాండవం చేయడం. Ipl 2024

Also Read: IPL 2024: CSK కు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ ఆటగాడు వచ్చేస్తున్నాడు?

గత రెండు నెలలుగా బెంగళూరు నగరంలో మంచినీటి సమస్య అలాగే సాగునీటి సమస్య విపరీతంగా పెరిగిపోయింది. సింపుల్ గా చెప్పాలంటే కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఇంట్లో కూడా అన్ని బోర్లు ఎండిపోయాయి. ఐటీ ఎంప్లాయిస్ కు వర్క్ from హోం కూడా ఇచ్చేశారు. దీంతో ఇంటి దగ్గరే ఉంటూ కొంతమంది ఉద్యోగస్తులు పని చేసుకుంటున్నారు. అలాగే మూడు నాలుగు రోజులకు ఒకసారి స్నానాలు చేస్తున్నారు జనాలు. Ipl 2024

ఇలాంటి నేపథ్యంలో బెంగళూరు నగరంలో మ్యాచులు ఎలా జరుగుతాయి అని అందరిలోనూ ఓ ఆసక్తి నెలకొంది. అయితే ఇలాంటి నేపథ్యంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు నగరంలోని వేస్ట్ వాటర్ ప్లాంట్ నుంచి.. చిన్న స్వామి స్టేడియం కు నీటిని సరఫరా చేయనుంది క్రికెట్ బోర్డు. మ్యాచ్ జరిగే రోజు సగటున 75 వేల లీటర్ల నీరు అవసరం అవుతుందట. దీనిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు నీటి కొరతతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడ మ్యాచ్ నిర్వహించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. Ipl 2024

Join WhatsApp