Shubman Gill Facing Tough Situation

Shubman Gill: టీమిండియా స్టార్‌ ప్లేయర్‌, ఓపెనర్‌ శుభమన్ గిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అతి తక్కువ కాలంలోనే.. టీమిండియాలో మంచి స్థానానికి ఎదిగాడు శుభమన్ గిల్. కెరీర్ ఆరంభంలో రికార్డులు బద్దలుకొడుతూ భవిష్యత్తు స్టార్ గా భరోసా ఇచ్చిన శుభమన్ గిల్ గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. వన్డేలు మినహా టెస్టులు, టీ20ల్లో పూర్తిగా తేలిపోతున్నాడు. కేవలం పరుగులు మాత్రమే చేస్తూ కఠిన పిచ్ ల మీద చేతులు ఎత్తేస్తున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల జరిగిన ప్రపంచకప్ లోను గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేదు.

Shubman Gill Facing Tough Situation

టైటిల్ మ్యాచ్ లో అవుట్ అయ్యి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. గిల్ ప్రదర్శన ఇలాగే కొనసాగితే అది అతని క్రికెట్ కెరిర్ కే ప్రమాదంగా మారే అవకాశం ఉంది. టీమ్ ఇండియాలో తన స్థానం కాపాడుకోవాలంటే గిల్ పరుగులు తప్పక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీమిండియాలో కొత్త ప్లేయర్స్ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. దీంతో టీమిండియాలో అతడి స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇటీవల జరిగిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో బ్యాకప్ ఓపెనర్ గా గిల్ ఆడాడు.

Also Read: India vs England: ఉప్పల్‌ మ్యాచ్‌ కు ముందు టీమిండియా బిగ్‌ షాక్‌ !

యశస్వి జైస్వాల్ అనారోగ్యంతో దూరం అవడంతో తొలి మ్యాచ్ లో మాత్రమే అతనికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత బెంచ్ కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతుంది. నేటి నుంచి హైదరాబాద్ వేదికగా ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఇప్పుడు గిల్ అసలు పరీక్షను ఎదుర్కొనున్నాడు. టెస్ట్ జట్టులో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే ఇంగ్లాండ్ సిరీస్ లో తప్పనిసరిగా సత్తా చాటాల్సి ఉంది.

Shubman Gill Facing Tough Situation

టెస్ట్ మ్యాచ్ కు ముందు సిరీస్ లో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను హెచ్చరించాడు. గిల్ ఫామ్ లోకి రావాలని ఎంతోమంది యువకులు సత్తా చాటుతున్నారని ద్రావిడ్ ఆసక్తికర వాక్యాలు చేశాడు. అంటే గిల్ ను రాహుల్ పరోక్షంగా హెచ్చరించాడు. గిల్ కాకపోతే క్యూలో రాణిస్తున్న ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో రాహుల్ ఈ షాకింగ్ కామెంట్స్ చేసినట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం రాహుల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి ఈ సిరీస్‌ లో గిల్‌ ఎలా రాణిస్తాడో చూడాలి. (Shubman Gill)

Join WhatsApp