Sunrisers Hyderabad Team Sentiment Work Out

Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024 టోర్నమెంటు చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు సగం మ్యాచులు పూర్తయ్యాయి. మరో సగం మ్యాచులు ఆడితే… టోర్నమెంట్ ముగిస్తుంది. అయితే ఈ టోర్నమెంట్లో టాప్ పొజిషన్లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. కానీ అన్ని జట్ల కంటే చాలా భయంకరంగా హైదరాబాద్ జట్టు తయారైంది. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ చేస్తే భయపడిపోతున్నారు బౌలర్లు. ఇప్పటివరకు 286, 277, 267 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది హైదరాబాద్ జట్టు. Sunrisers Hyderabad

Sunrisers Hyderabad Team Sentiment Work Out

200 పరుగులు చేయడమే గగనంగా ఉన్న నేపథ్యంలో 300 పరుగులు కూడా చాలా సులభంగా కొడుతోంది హైదరాబాద్. ఈ లెక్కన ఈసారి టోర్నమెంట్ హైదరాబాద్ జట్టు కొడుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాకుండా ఆస్ట్రేలియా సెంటిమెంట్ హైదరాబాద్కు పనిచేస్తుందని… దానివల్ల కచ్చితంగా ఈసారి కప్పు హైదరాబాద్ దేనని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. కమిన్స్ ఆస్ట్రేలియాకు చెందినవాడు. Sunrisers Hyderabad

Also Read: Preity Zinta: పంజాబ్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ..కోట్లల్లో ఆఫర్ ఇచ్చిన ప్రీతి జింటా ?

అయితే 2009 సంవత్సరంలో డెక్కన్ చార్జెస్ జట్టు ఛాంపియన్గా నిలిచింది. అప్పుడు ఆర్సిబి పై ఫైనల్ లో విజయం సాధించింది డెక్కన్ చార్జెస్. హైదరాబాద్ నగరం తరఫున డెక్కన్ చార్జెస్ రంగంలోకి దిగింది. అయితే అప్పుడు డెక్కన్ చార్జెస్ కెప్టెన్ గా గిల్ క్రీస్ట్ కెప్టెన్ గా ఉన్నాడు. అప్పుడు డెక్కన్ చార్జెస్ విజయం సాధించింది. ఇక 2016 సంవత్సరంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఆర్సిబి జట్టుపై హైదరాబాద్ విజయం సాధించింది.

అప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ఉన్నాడు. డేవిడ్ వార్నర్ కూడా ఆస్ట్రేలియా దేశస్థుడు అన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 2024 ఐపీఎల్ టోర్నమెంట్ లో కూడా ఆస్ట్రేలియా దేశస్థుడు అయినా కమ్మిన్స్ కు కెప్టెన్సీ అప్పగించారు కావ్య మారాన్. దానికి తగ్గట్టుగానే హైదరాబాద్ జట్టు విజయాల పరంపర కొనసాగుతోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ కాబట్టి ఈసారి కూడా తప్పు మనదే అని కొంతమంది అంటున్నారు.

Join WhatsApp