Suryakumar named captain of ICC T20I team of the year

T20: సూర్యకుమార్ యాదవ్ కు కు బంపర్‌ ఆఫర్‌ దక్కింది. గతేడాది టీ20లో దుమ్మురేపిన సూర్యకుమార్ యాదవ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టుకు సూర్య కెప్టెన్ అయ్యాడు. గతేడాది మెరుపులు మెరిపించిన ప్లేయర్లతో ఐసీసీ జట్టును రూపొందించింది. ఆ జట్టును లీడ్ చేసే బాధ్యతను మాత్రం సూర్యకే అప్పగించింది. నిజానికి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టేస్తున్నాడు. టీ20లో పరుగులు పోటెత్తిస్తున్నాడు. మ్యాచ్ ఎక్కడ జరిగిన స్టాండ్ గా చూపిస్తున్నాడు. మిస్టర్ 360గా ప్రశంసలు అందుకుంటున్నాడు.

Suryakumar Named Captain of ICC T20I Team of the Year

కెప్టెన్ గాను మంచి మార్కులు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో బై లిటరల్ సిరీస్ లో సూపర్ సక్సెస్ అయ్యాడు. టీమిండియాకు టీ20 సిరీస్ ను అందించాడు. ఆ తర్వాత సౌతాఫ్రికా గడ్డమీద ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీ మెటీరియల్ గా పేరు తెచ్చుకున్నాడు. బ్యాటర్ గాను 2023 క్యాలెండర్ ఇయర్ లో అరుదైన సంతకం చేశాడు. 18 మ్యాచుల్లో 733 పరుగులు సాధించాడు. 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో తాను ఎందుకు ప్రత్యేకమో చాటుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఐసీసీ 2023 టీం లో యశస్వి జైస్వాల్ కూడా చోటు దక్కించుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్ లోకి గతేడాది ఈ యువ ప్లేయర్ అరంగేట్రం చేశాడు. ఎంట్రీతోనే బ్యాట్ తో పంజా విసిరాడు. 2023లో 14 ఇన్నింగ్స్ లో 430 పరుగులు చేశాడు. 159 స్ట్రైక్ రేటుతో అభిమానులను ఫిదా చేశాడు. ఐసీసీ ప్రకటించిన టీం లో ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా ఉన్నాడు. గతేడాది సాల్ట్ ఎనిమిది ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశాడు. 394 పరుగులు సాధించాడు. వికెట్ కీపర్ గా వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ చోటు దక్కించుకున్నాడు. ఈ కరేబియన్ ప్లేయర్ 2023లో 13 ఇన్నింగ్స్ లో మూడు సార్లు మాత్రమే రెండంకెల స్కోరును అందుకోలేకపోయాడు. 163 స్ట్రైక్ రేట్, 384 పరుగులతోనే నికోలస్ పూరన్ టాక్ ఆఫ్ ది క్రికెట్ అయ్యాడు. ఐసీసీ టీం లో న్యూజిలాండ్ ప్లేయర్ మార్క్ ఛాప్ మన్ సైతం చోటు దక్కించుకున్నాడు.

Also Read: Sara Tendulkar: శుభ మన్ గిల్ తో పెళ్లికి ఓకే చెప్పినా సారా ?

గతేడాది ఛాప్ మన్ 576 రన్స్ చేశాడు. 4వ స్థానం, 5వ స్థానంలో నిలకడగా రాణించాడు. జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రాజా కూడా 2023లో సక్సెస్ అయ్యాడు. బ్యాటర్ గా, బౌలర్ గా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐసీసీ ప్రకటించిన జట్టులో ఉగాండా ఆటగాడు అల్పేష్ ఉన్నాడు. ఐర్లాండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ మార్క్, భారత యువస్పిన్నర్ రవి బిష్నోయ్ కూడా చోటు దక్కించుకున్నాడు. (T20)

Join WhatsApp