Suryakumar Yadav confirms IPL 2024 absence

Ipl 2024: ఐపీఎల్ 2024 టోర్నమెంటు మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కానుంది. మరికొన్ని అనేకంటే… మరో మూడు రోజుల్లోనే ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు.. ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. తమ హోమ్ గ్రౌండ్ లకు చేరుకొనీ… ప్రాక్టీస్ చేస్తున్నాయి జట్లు. అయితే ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ టోర్నమెంట్లో మొదటి ఎడిషన్ లో రోహిత్ శర్మ దూరం అవుతాడని కొంతమంది వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. Ipl 2024

Suryakumar Yadav confirms IPL 2024 absence

అయితే ఇందులో వాస్తవం ఎంతో ఉందో తెలియదు కానీ ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. సూర్య కుమార్ యాదవ్ ఈసారి ఐపిఎల్ ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది. మిస్టర్ 360 డిగ్రీ క్లియర్ గా పేరు గాంచిన సూర్య కుమార్ యాదవ్…. ఐపీఎల్ 2024 టోర్నమెంటు ఆడే అవకాశాలు లేనట్టే తెలుస్తోంది. ఐపీఎల్ టోర్నమెంట్ ముందు ముంబై ఇండియన్స్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ పోస్టు పెట్టారు. Ipl 2024

Also Read: WPL 2024: WPL విజేత RCB… ఫ్రైజ్‌ మనీ ఎన్ని కోట్లో తెలుసా?

గత సంవత్సరం దక్షిణాఫ్రికా పర్యటనలో సూర్య కుమార్ యాదవ్ కు చీలమండ గాయం అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే సూర్య కుమార్ యాదవ్ జనవరిలో సర్జరీ చేయించుకున్నాడు. అప్పటినుంచి టీమిండియా కు దూరంగానే ఉంటున్నాడు సూర్య కుమార్ యాదవ్. అయితే గాయం మంచి కోరుకునేందుకు సర్జరీ చేయించుకున్న సూర్య కుమార్ యాదవ్… ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. Ipl 2024

ఇంకా పూర్తి ఫిట్నెస్ సూర్య కుమార్ యాదవ్ సాధించలేదని సమాచారం అందుతుంది. ఈ కారణంతో ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ఆడేందుకు సూర్యకుమార్ యాదవ్ కు జాతీయ క్రికెటర్ అకాడమీ బెంగళూరు పర్మిషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేక్ పోస్ట్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ముంబై ఇండియన్స్ ఫాన్స్ అలాగే సూర్య కుమార్ యాదవ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Ipl 2024

Join WhatsApp