Team India Level Series With 106-Run Win In Vizag

IND VS ENG: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఓడిన టీమిండియా… విశాఖలో మళ్లీ పరువు నిలబెట్టుకుంది. విశాఖ వేదికగా జరిగిన రెండవ టెస్టు మ్యాచ్లో… టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. రెండవ టెస్ట్ మ్యాచ్ ను మూడు రోజుల్లోనే ఫినిష్ చేసింది టీమిండియా. ఏకంగా ఇంగ్లాండ్ జట్టుపై 106 పరుగుల తేడాతో రెండవ టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది టీమిండియా జట్టు. దీంతో ఐదు టెస్టుల సిరీస్ ను 1-1 తేడాతో సమం చేసింది టీం ఇండియా.IND VS ENG

Team India Level Series With 106-Run Win In Vizag

ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే… ఈ టెస్ట్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. ఆ సమయంలో యశస్వి జైస్వాల్ 200 పరుగులు చేసి టీమిండియాను ఆదుకున్నాడు. అటు మొదటి ఇన్నింగ్స్ లోడ్ ఇంగ్లాండ్ జట్టు గోరంగా విఫలమైంది. కేవలం 253 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది ఇంగ్లాండ్ జట్టు. అనంతరం రెండో ఇన్నీ0గ్స్ ప్రారంభించిన ఇండియా జట్టు… 255 పరుగులకు ఆల్ అవుట్ అయింది.

Also Read: Yashasvi Jaiswal: ఇంటి నుంచి పారిపోయి టీమిండియా స్టార్‌ అయ్యాడు..తినడానికి తిండి లేకున్నా!

అయితే రెండవ ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాట్స్మెన్ గిల్ అద్భుతంగా రానించాడు. ఏకంగా 104 పరుగులు చేసి టీమిండియా జట్టును ఆదుకున్నాడు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం ఇంగ్లాండ్ జట్టు… దారుణంగా విఫలమైంది. 292 పరుగులకు ఆల్ అవుట్ అయింది ఇంగ్లాండ్. దీంతో టీమిండియా 106 పరుగుల తేడాతో రెండవ టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది.IND VS ENG

అయితే విశాఖ టెస్ట్ లో టీమిండియా విజయం వెనుక ఐదు కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్. మొదటి టెస్ట్ లో ఆడిన తీరుగానే రెండవ టెస్టులో ఆడి డబుల్ సెంచరీ చేసుకున్నాడు యశస్వి జైస్వాల్. అలాగే రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసి టీమిండియాను ఆదుకున్నాడు గిల్. అంతేకాకుండా బౌలర్లలో బుమ్రా తన ప్రభంజనం సృష్టించాడు. స్పిన్నర్లు కూడా అద్భుతంగా రానించారు. మొదటి మ్యాచ్లో ఘోరంగా విఫలమైన రోహిత్ శర్మ కెప్టెన్సీ… రెండవ మ్యాచ్ లో మాత్రం సక్సెస్ అయింది. ఈ ఐదు కారణాల వల్ల టీమిండియా ఘన విజయం సాధించింది.IND VS ENG

Join WhatsApp