Trolling Over Rohit Sharma on Lost Test Match Against IND vs ENG

IND vs ENG: ఉప్పల్ టెస్ట్ లో ఇంగ్లాండ్‌ చేతిలో టీమిండియా దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే..ఉప్పల్ టెస్ట్ లో టీమిండియా ఓటమి తర్వాత రోహిత్ ను కొందరు టార్గెట్ చేస్తున్నారు. హిట్ మ్యాన్ కెప్టెన్సీ వల్లే భారత్ ఓడిపోయింది అంటున్నారు. స్వదేశంలో చివరి మూడు టెస్టుల్లో భారత్ రెండు ఓడిపోయిందని ఆడేసుకుంటున్నారు. గెలవాల్సిన మ్యాచ్లో ఓటమికి రోహితే బాధ్యుడని ఫైర్ అవుతున్నారు. అంతేకాదు..కెప్టెన్సీ నుంచి తొలగిపోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిజానికి మొన్నటివరకు హిట్ మ్యాన్ ను విమర్శకులు కూడా పొగిడారు. కేప్ టౌన్ లో సౌత్ ఆఫ్రికాపై గెలిచాక ఆకాశానికి ఎత్తేశారు.

Trolling Over Rohit Sharma on Lost Test Match Against IND vs ENG

కేప్ టౌన్ లో టీమిండియాను గెలిపించిన సూపర్ కెప్టెన్ అని కితాబు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆడిన తొలిటెస్టులో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు విమర్శలు పెరిగిపోతున్నాయి. రోహిత్ కెప్టెన్సీ వల్లే భారత్ ఓడిపోయిందని కొందరు బౌన్సర్లు సంధిస్తున్నారు. బౌలర్లను వ్యూహాత్మకంగా మార్చలేదంటున్నారు. ఫీల్డింగ్ లో కూడా సరిగ్గా సెట్ చేయలేదని అంటున్నారు. సీనియర్ ప్లేయర్ గా బ్యాటింగ్ లోను దూకుడు చూపించలేదు అంటున్నారు. ఒక్క ఇన్నింగ్స్ లోనైనా రోహిత్ భారీ స్కోర్ చేసి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవంటున్నారు. కోహ్లీ, పోప్ ను కట్టడి చేయడంలో హిట్ మ్యాన్ విఫలమయ్యాడని అంటున్నారు. పోప్ ను త్వరగా అవుట్ చేసి ఉంటే టీమిండియానే సులభంగా గెలిచేదని అంటున్నారు.

సహచర ప్లేయర్లలో రోహిత్ స్ఫూర్తినింపలేకపోయాడని విమర్శిస్తున్నారు. హిట్ మ్యాన్ లోను ఒత్తిడి కనిపించింది అంటున్నారు. ఇంగ్లాండ్ భారీ స్కోర్ కొట్టిన తర్వాత డిఫెన్స్ లోను పడిపోయిందని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా హిట్ మ్యాన్ ను విలన్ గా చూస్తున్నారు. కొందరైతే కోహ్లీ కెప్టెన్సీతో పోలుస్తున్నారు. విరాట్ కెప్టెన్ గా ఉండి ఉంటే ఉప్పల్ టెస్ట్ లో టీమిండియానే గెలిచేదని అంటున్నారు. అయితే కోహ్లీ తో రోహిత్ ను పోల్చడం సరైనది కాదనే వాదన వినిపిస్తోంది. ఒక్కోసారి పరిస్థితులు ఒక్కోలా ఉంటాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. (IND vs ENG)

Also Read: Team India: ఉప్పల్ లో టీమిండియా ఓటమికి కారణాలు ఇవే

ఇప్పుడు టెస్ట్ సిరీస్ లో టీమిండియా పుంజుకోవాలంటే రోహిత్ శర్మ పంజా విసరాల్సిందేనని అంటున్నారు. వన్డే వరల్డ్ కప్ లో మాదిరిగా హిట్ మ్యాన్ ఇరగదీయాలి అంటున్నారు. టెస్టుల్లో చాలాకాలం నుంచి రోహిత్ భారీస్కోర్ బాకీ ఉన్నాడని గుర్తుచేస్తున్నారు. గత ఆరు ఇన్నింగ్స్ లో హిట్ మ్యాన్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. రోహిత్ ఖాతాలో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేరలేదు. సెంచూరియన్ టెస్ట్ లో ఒక ఇన్నింగ్స్ లో ఐదు పరుగులు చేశాడు. మరో ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయ్యాడు. కేప్ టౌన్ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో 39 పరుగులు సాధించాడు. రెండో ఇన్నింగ్స్ లో 16 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఉప్పల్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 24, రెండో ఇన్నింగ్స్ లో 39 పరుగులకు పరిమితమయ్యాడు. (IND vs ENG)

Join WhatsApp